ఆంధ్రప్రదేశ్‌

నీరు-ప్రగతి విజయం అందరి బాధ్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 24: నీరు-ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయడం ప్రతి ప్రజాప్రతినిధి, ఉద్యోగి బాధ్యత అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సోమవారం ఉండవల్లిలోని తన నివాసం నుంచి వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులతో ఆయన టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో 18.4 శాతం వర్షపాతం లోటు ఉందని, ఒకరోజు వర్షం పడి మరోరోజు పడకపోవడం వల్ల సమస్యలు తలెత్తుతున్నాయని తెలిపారు. రాష్టవ్య్రాప్తంగా నీరు-ప్రగతి కార్యక్రమ సత్ఫలితాల వల్లే భూగర్భ జలం 2 మీటర్లు పెరిగిందని, గత ఏడాది 12 మీటర్ల లోతున ఉండగా ఈ ఏడాది 10 మీటర్లకు వచ్చిందని తెలిపారు. 175 మండలాల్లో భూగర్భ జలాలు 15 మీటర్ల కంటే దిగువన ఉన్నాయంటూ రాయలసీమ ప్రాంతంలో 116 మండలాలు, కోస్తాలో 59 మండలాల్లో ఈ పరిస్థితి ఉందన్నారు. ఆయా ప్రాంతాల్లో మరింత చురుగ్గా జలసంరక్షణ పనులు చేపట్టాలని ఆయన ఆదేశించారు. జలాశయాల్లో అందుబాటులో ఉన్న నీటిని రబీ పంటలకు సక్రమంగా అందించాలని చంద్రబాబు సూచించారు. రెయిన్‌గన్స్, మొబైల్ స్ప్రింక్లర్లను వినియోగించుకుని తక్కువ నీటితో ఎక్కువ పంటలకు సాగునీరు అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాబోయే వేసవిలో ఎదురయ్యే మంచినీటి ఎద్దడిని దృష్టిలో ఉంచుకుని ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేసి అమలు చేయాలన్నారు. ఈ ఏడాది ‘నరేగా‘ కింద ఇప్పటివరకు రూ.3,500 కోట్లు ఖర్చు చేశామని, దేశంలోనే ముందంజలో ఉన్నామని, మనల్ని చూసి మిగిలిన రాష్ట్రాలు కూడా నిధుల కన్వర్జెన్స్‌పై దృష్టిపెట్టాయని అధికారులు వివరించారు. నరేగా కింద మెటీరియల్ కాంపోనెంట్ నిధులు రూ.356 కోట్లు ఇంకా ఖర్చుచేయాల్సి ఉందని, రాబోయే 5నెలల్లో వాటిని పూర్తిగా వ్యయం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. మరింత స్ఫూర్తిమంతంగా పనిచేసి లక్ష్యాలను చేరుకోవాలన్నారు. కరవు మండలాల్లో 150 రోజులు ఉపాధి కల్పించాలని ఆదేశించారు. సిమెంట్ రోడ్ల నిర్మాణం మరింత వేగం పుంజుకోవాలన్నారు. లక్ష్యం 5వేల కి.మీలు కాగా ఇప్పటివరకు 2,480 కి.మీలు వేసినట్లు తెలిపారు. ఈ వారం 5 జిల్లాల్లో సగటున 10 కి.మీల చొప్పున నిర్మించగా 4 జిల్లాల్లో 5-10 కి.మీల మధ్య వేశారని, మరో 4 జిల్లాల్లో 5 కి.మీల కంటే తక్కువ వేశారని అంటూ ప్రతి జిల్లాలో వారానికి 10 కి.మీల సిమెంట్ రోడ్ల నిర్మాణం తప్పకుండా జరిగేలా శ్రద్ధ వహించాలన్నారు. అంగన్‌వాడీ భవనాలు, మండల పరిషత్, గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణంలో జాప్యం జరగడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అన్ని భవనాల నిర్మాణాన్ని 2017 మార్చి నెలాఖరుకల్లా పూర్తిచేయాలని ఆదేశించారు. వర్మీకంపోస్టు కేంద్రాల ఏర్పాటు లక్ష్యం 2 లక్షలకు గాను 59వేలు మాత్రమే గ్రవుండ్ చేశారంటూ, మిగిలినవి కూడా త్వరితగతిన గ్రవుండ్ చేయాలన్నారు. ప్రతి గ్రామంలో వర్మీకంపోస్టు కేంద్రాలు, శ్మశానాలు, ఆటస్థలాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఎన్టీఆర్ రూరల్ హౌసింగ్, అర్బన్ హౌసింగ్ కింద మంజూరైన ఇళ్ల నిర్మాణం త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. 2018కల్లా రాష్ట్రాన్ని స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ చేయాలంటే ఇప్పటి నుంచి ప్రతినెలా ఎన్ని మరుగుదొడ్లు నిర్మించాలనే దానిపై అంచనాలు రూపొందించి సక్రమంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. టెలీ కాన్ఫరెన్స్‌లో సిఎంవో సహ కార్యదర్శి ప్రద్యుమ్న, వివిధ శాఖల ఉన్నతాధికారులు దినేష్ కుమార్, శశిభూషణ్, రామాంజనేయులు, జవహర్ రెడ్డి, వెంకటేశ్వరరావు, కృష్ణమోహన్, కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు, సర్పంచ్‌లు పాల్గొన్నారు.