ఆంధ్రప్రదేశ్‌

అసెంబ్లీ కార్యదర్శికి అర్హతలు లేవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 24: ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఇన్‌చార్జి కార్యదర్శి సత్యనారాయణ ఆ పదవికి అనర్హుడని పేర్కొంటూ హైకోర్టులో సోమవారం పిటిషన్ దాఖలైంది. శాసనసభ కార్యదర్శి పదవికి సత్యనారాయణకు అవసరమైన విద్యార్హతలు ఆయనకు లేవని పేర్కొంటూ మంగళగిరి వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. అసెంబ్లీ కార్యదర్శిగా కొనసాగాలంటే వారికి న్యాయవిద్య అర్హత ఉండాలని, సత్యనారాయణకు న్యాయవిద్యలో డిగ్రీ లేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈమేరకు ఎమ్మెల్యే తరఫున న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై స్పందించిన హైకోర్టు అసెంబ్లీ కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఎపి ప్రభుత్వాన్ని ఆదేశించింది. కనీసం డిగ్రీ కూడా లేని వ్యక్తి అసెంబ్లీ కార్యదర్శిగా ఎలా వ్యవహరిస్తారని ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. అసెంబ్లీ కార్యదర్శిగా వ్యవహరించే వ్యక్తి లా డిగ్రీ చదివి ఉండాలని సర్వీసు రూల్స్‌లో ఉందని పేర్కొన్నారు. బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌లో చార్జిషీట్ దాఖలు అయితే, నాంపల్లి కోర్టుకు హాజరవుతున్నారని రూల్స్ ప్రకారం కేసులున్న వ్యక్తి కోర్టుకు హాజరైతే, చార్జిషీట్ దాఖలైతే సస్పెండ్ చేయాల్సి ఉందని, ఈ అంశంపై తాను గవర్నర్‌కు కూడా లేఖ రాశానని, దానిపై ఎలాంటి స్పందన లేదని చెప్పారు.