ఆంధ్రప్రదేశ్‌

రైతులను ఆదుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కణేకల్లు, అక్టోబర్ 25: అధికారంలోకి వస్తే రైతులను ఆదుకునే పార్టీ తమదని గొప్పలు చెప్పుకున్న తెలుగుదేశం తీరా అధికారంలోకి వచ్చాక అదే రైతులను నట్టేట ముంచిందని పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఆరోపించారు. అనంతపురం జిల్లా కనేకల్లు మండలంలోని ఎస్‌ఆర్‌ఎన్ క్యాంప్ నుండి బెనకల్లు, బ్రహ్మసముద్రం మీదుగా 7 కిలోమీటర్ల దూరం కాంగ్రెస్ నాయకులు రఘువీరారెడ్డి, కేంద్ర మాజీమంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి, తదితరులు మంగళవారం రైతు భరోసా పాదయాత్ర చేపట్టారు. పాదయాత్రలో భాగంగా దారిపొడవునా నీళ్లు లేక ఎండిన పంటలను వారు పరిశీలించారు. బ్రహ్మసముద్రం బహిరంగ సభలో రఘువీరా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఏనాడైనా ఈ ప్రాంతంలో ఒక్క ఎకరా అయినా ఎండిందా అని ప్రశ్నించారు. పదేళ్ల కాంగ్రెస్ పాలనలో ఏడేళ్లు కరువు వచ్చినా ఒక్క ఎకరా కూడా ఎండకుండా పంటలను కాపాడామన్నారు. అదే టిడిపి ప్రభుత్వం రెయిన్‌గన్ల పేర దాదాపు రూ.360 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేసిందన్నారు. అయితే ఒక్క ఎకరా పంటను కూడా కాపాడలేకపోయారన్నారు. డ్యాష్‌బోర్డు సహకారంతో అన్ని ప్రాంతాల్లోని వివరాలు తెలుసుకుంటున్నానని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రికి అనంతపురం జిల్లా కరవు కనిపించలేదా అని ప్రశ్నించారు. సింగపూర్, మలేషియా, రష్యా అంటూ విదేశీయుల బూట్లు నాకేందుకు ప్రయత్నిస్తున్నారే తప్ప రైతులను పట్టించుకునేది ఎమైనా ఉందా అని నిలదీశారు. వరి, ఆరుతడి పంటలు నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.30 వేలు, కౌలు రైతులకు ఎకరాకు రూ.50 వేల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.