ఆంధ్రప్రదేశ్‌

బ్రాహ్మణులు మార్గదర్శకులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 25: భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను, కుటుంబ వ్యవస్థను స్థిరంగా నిలవడంలో బ్రాహ్మణులు మార్గదర్శకంగా నిలుస్తున్నారని సిఎం చంద్రబాబు తెలిపారు. సమాజాన్ని కాపాడేది బ్రహ్మణులేనని, వారు నీతికి, నిజాయితీకి మారుపేరని తెలిపారు. మంగళవారం బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీని బందరు రోడ్డులో ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ 2014 పాదయాత్ర సందర్భంలో బ్రాహ్మణుల ఆర్థిక, సామాజిక స్థితిగతులను తెలుసుకుని వారిని పైకి తీసుకు రావాలనే నిర్ణయం తీసుకున్నానన్నారు. నాలెజ్డ్ అంటే బ్రాహ్మణులని, వారికి ఆత్మ గౌరవం ఎక్కువని, వారికి చేయూతనిస్తే పైకి వస్తారనే ఆలోచనతో బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేశామని తెలిపారు. కార్పొరేషన్ ద్వారా భారతి, వశిష్ట, ద్రోణాచార్య, చాణుక్య, కాశ్యప, గరుడ, అరుంధతి వంటి వినూత్న పథకాలతో ఐవిఆర్ కృష్ణారావు ముందుకు వచ్చి అందరికి ఆదర్శప్రాయంగా నిలిచారన్నారు. బ్రాహ్మణ పిల్లలను ప్రోత్సహిస్తే సామాజికపరంగా ఎంతో అభివృద్ధి సాధిస్తారనే నమ్మకం తనకు ఉందని, కష్టపడేతత్వం వారి సొంతమన్నారు. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీని రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభిస్తూ రాజాం మహిళలు రూపొందించిన వంటకాలను అద్భుతమని ముఖ్యమంత్రి అన్నారు. ఆర్థికంగా బ్రాహ్మణ సామాజిక వర్గానికి చేయూత అందించడమే లక్ష్యంగా రుణాలు అందిస్తున్నామని, తీసుకున్న రుణాలను తప్పనిసరిగా చెల్లించాలని కార్పొరేషన్ చైర్మన్ ఐవిఆర్ కృష్ణారావు స్పష్టం చేశారు. సమాజ సేవా కార్యక్రమాల్లో బ్రాహ్మణులు ముందుకు రావాలని ఆ దిశగా చర్యలు చేపడుతున్నామని సిఎం తెలిపారు. రాజాంశర్మ సోదరులను సిఎం అభినందించారు.

చిత్రం.. బ్రాహ్మణ కో ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీని జ్యోతి వెలిగించి ప్రారంభిస్తున్న చంద్రబాబు