ఆంధ్రప్రదేశ్‌

గాజులతో దుర్గమ్మకు ప్రత్యేక అలంకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (ఇంద్రకీలాద్రి) అక్టోబర్ 25: ఇంద్రకీలాద్రి అధిష్ఠాన దేవతగా ఉన్న శ్రీకనకదుర్గమ్మ గాజులే సర్వ ఆభరణాలుగా ధరించి భక్తకోటికి మంగళకరమైన దివ్య దర్శనం మిచ్చింది. రాష్ట్రంలోని మహిళలు అందరు సౌభాగ్యంతో ఉండాలని, వివాహం కాని యువతులకు వెంటనే వివాహం కావాలని ఆకాంక్షిస్తూ శ్రీదుర్గా మల్లేశ్వరస్వామివార్ల దేవస్థానం ఆధ్వర్యంలో తొలిసారిగా అమ్మవార్లకు ఈ ప్రత్యేక అలంకారం చేశారు. సుమారు 4 లక్షల గాజులతో ప్రత్యేకంగా అలంకరించిన దుర్గమ్మను దర్శించుకోవటానికి మంగళవారం మహిళ భక్తులు వేకువ జామునుండే ఇంద్రకీలాద్రికి అధిక సంఖ్యలో తరలి వచ్చారు. అంతరాలయంలో మూల విరాట్ విగ్రహంతోపాటు శ్రీమల్లిఖార్జున మహామంటపంలో కొలువై ఉన్న ఉత్సవమూర్తికి సైతం గాజులతో అలంకారం చేసారు. ఇంద్రకీలాద్రిపై మూలవిరాట్‌ను దర్శించుకున్న అనంతరం ఉత్సవమూర్తిని కూడా దర్శించుకునే విధంగా అధికారులు ఏర్పాట్లు చేశారు. మంగళవారం వేకువ జామున నిర్వహించే ఖడ్గమాల పూజను రద్దు చేసి అలంకార సామ్రాట్ బద్రీనాధ్‌బాబు ఆధ్వర్యంలో అర్చకులు అమ్మవార్లకు ఈ ప్రత్యేక అలంకారం చేసారు. ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు, తిరిగి సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 9గంటల వరకు అమ్మవారి సన్నిధిలో భక్తుల రద్దీ కనబడింది.