ఆంధ్రప్రదేశ్‌

ముగ్గురిదీ ఉద్యమ బాటే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, అక్టోబర్ 25: వారంతా ఒకటే కుటుంబం, తండ్రిదీ ఉద్యమ నేపథ్యమే. అయితే జనజీవన స్రవంతిలో కలిసిన లక్ష్మణరావుకు ముగ్గురు సంతానం, అరుణ, ఝాన్సీ, ఆజాద్ వీరంతా విజయవాడకు చెందిన వారే. అయితే కాల క్రమంలో లక్ష్మణరావు ఉద్యమ బాట వీడి జనజీవన స్రవంతిలో కలిసిపోయారు. అయితే వారసత్వంగా అరుణ ముందుగా మావోయిస్టు కార్యకలాపాల్లో పాలుపంచుకుంది. కొంత కాలానికి ఆమె సోదరి ఝాన్సీ కూడా ప్రజా ఉద్యమాల బాట పట్టింది. ఇది జరిగిన కొంత కాలానికి వీరి సోదరుడు ఆజాద్ కూడా మావోయిస్టు సానుభూతి పరుడిగా ముద్ర వేసుకున్నాడు. అయితే మావోయిస్టులకు సమాచారం చేయడంతో పాటు ఆయుధాలు సమకూరుస్తున్నాడన్న నెపంతో ఆజాద్‌ను పోలీసులు అరెస్టు చేశారు. తిరిగి 2004లో ఆజాద్ మావోయిస్టు కార్యక్రమాల్లో చరుకుగా పాల్గొంటూ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి సోదరి అరుణతో కలిసి గాలికొండ దళం బాధ్యతలు చూస్తూ వచ్చారు. ఈక్రమంలో ఇటీవల కొయ్యూరు సమీపంలో జరిగిన ఎన్ కౌంటర్‌లో ఆజాద్‌ను పోలీసులు మట్టుపెట్టారు. ఆజాద్ వద్ద లభించిన ఆధారాల్లో అరుణతో పాటు రామచంద్రారెడ్డి అలియాస్ చలపతి ఫొటోలను పోలీసులు గుర్తించారు. దీంతో అప్పుడప్పుడు జనబాహుళ్యంలోకి వచ్చే వీరికి దారులు మూసుకుపోయాయి. తాజాగా బూసిపుట్టు వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌లో అరుణ, చలపతి మృతి చెందారు. ఒకప్పుడు మావోయిస్టుగా జీవితాన్ని ప్రారభించిన లక్ష్మణరావు ఇప్పుడు కుమార్తె, కుమారుని పోగొట్టుకుని కుమిలిపోతున్నారు.