ఆంధ్రప్రదేశ్‌

అది బూటకపు ఎన్‌కౌంటరే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, అక్టోబర్ 25: ఆంధ్రా ఒడిశా సరిహద్దు (ఎఓబి) బూసిపుట్టు వద్ద జరిగిన ఎన్‌కౌంటర్ ముమ్మాటికీ బూటకమేనని, పోలీసులే కాల్చి చంపి, ఎన్‌కౌంటర్‌గా కథనం అల్లుతున్నారని విప్లవ రచయితల సంఘం (విరసం) నేత వరవరరావు ఆరోపించారు. ఎన్‌కౌంటర్‌లో మరణించిన అరుణక్క కుటుంబాన్ని విశాఖలో మంగళవారం పరామర్శించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ గత వారం రోజులుగా గ్రేహౌండ్స్ దళాలు పక్కా ప్రణాళికతోనే ఈ ఘాతుకానికి పాల్పడ్డాయని ఆరోపించారు. ఎన్‌కౌంటర్ జరిగినట్టుగా ఫొటోలు చూపుతున్నారు తప్ప, మృతదేహాలను చూపించట్లేదని, చనిపోయిన మావోయిస్టులను పోలీసు బెటాలియన్‌లో ఉంచడం వెనుక మర్మం ఉందన్న అనుమానం వ్యక్తం చేశారు. చనిపోయిన వారిని ఆసుపత్రికి తీసుకువచ్చి, బంధువులకు చూపించి, గుర్తించిన తరువాత ప్రకటించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు బాక్సైట్ నిక్షేపాలను దక్కించుకునేందుకు ఈ ఘాతుకానికి ఒడిగట్టారని ఆరోపించారు. ఇదిలా ఉండగా బూసిపుట్టు వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌లో హతమైనట్టు ప్రచారం జరుగుతున్న రవి అలియాస్ ఉదయ్ కుటుంబ సభ్యులు మంగళవారం ఉదయం విశాఖ చేరుకున్నారు. తెలంగాణ పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు తాము ఇక్కడకు వచ్చామని, అయితే మృతదేహాలు చూసేందుకు మల్కన్‌గిరి వెళ్లి నిర్ధారించుకునే పరిస్థితి తలెత్తిందన్నారు.