ఆంధ్రప్రదేశ్‌

ఏడాది కిందటే స్కెచ్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, అక్టోబర్ 25: ఏఓబిలో మావోయిస్ట్‌ల ఉనికిని పూర్తిగా తుడిచివేయడానికి ఏడాది కిందటే పోలీస్ ఉన్నతాధికారులు స్కెచ్ వేశారా? ఈ విషయాన్ని పోలీస్ శాఖలో దిగువ స్థాయి అధికారులకు తెలియకుండా ఉన్నతాధికారులు జాగ్రత్త పడ్డారా? ఆంధ్ర, ఒడిశా పోలీస్ అధికారులకు మాత్రమే విషయాన్ని తెలిసి, వ్యూహాత్మకంగా మావోలపై దాడులకు దిగారా? ఇది నిజమేనంటున్నాయి పోలీసు వర్గాలు. దేశంలోనే సంచలనం సృష్టించిన బూసిపుట్టు ఎన్‌కౌంటర్‌లో 28 మంది చనిపోవడానికి పోలీసు ఉన్నతాధికారులు పక్కా వ్యూహమే కారణమని తెలుస్తోంది. గత ఏడాది విశాఖలో పోలీస్ ఉన్నతాధికారులు కీలక సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో ఆంధ్ర, ఒడిశా పోలీసు ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. ఏఓబిలో ఆపరేషన్ గ్రీన్ హంట్‌ను మావోయిస్ట్‌లు వ్యతిరేకిస్తున్నారు. అయినప్పటికీ పోలీసు యంత్రాంగం తనపని తాను చేసుకుపోతోంది. మరోపక్క విశాఖ మన్యంలో బాక్సైట్ తవ్వకాలను చేపట్టడానికి ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తోంది. దీన్ని మావోయిస్ట్‌లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కొత్త వ్యూహంతో మావోలపై దాడులకు దిగాలని ఈ సమావేశంలో నిర్ణయించినట్టు సమాచారం. ఈ బాధ్యతను గ్రేహౌండ్స్ మాజీ డిజి, సిఆర్‌పిఎఫ్ డైరక్టర్ జనరల్ దుర్గాప్రసాద్ చేపట్టినట్టు తెలుస్తోంది. దుర్గాప్రసాద్ ఏడాది కాలంగా ఏఓబిలో మావోయిస్ట్ కార్యకలాపాలపై దృష్టి సారించినట్టు తెలుస్తోంది. మావోయిస్ట్‌లు కదలికలతోపాటు, కొత్త రిక్రూట్‌మెంట్‌లు, ఆయుధ సేకరణ, ఎప్పుడెప్పుడు, ఎక్కడెక్కడ మావోలు సమావేశాలు నిర్వహిస్తున్నారన్న సమాచారాన్ని కూలంకషంగా సేకరించారు. ముంచింగిపుట్, కోరాపుట్ మధ్య ఉన్న కటాఫ్ ఏరియాలో మావోలు సమావేశమవుతారన్న విషయం పోలీసు ఉన్నతాధికారులకు ముందుగానే సమాచారం అందింది. కేవలం కొద్ది రోజుల కిందటే ఏపి, ఓడిశా డిజిలకు ఈ విషయాన్ని తెలియచేశారని తెలుస్తోంది. దీంతో పోలీసు బలగాలను సిద్ధం చేశారు. డూ ఆర్ డై అనేవిధంగా ఉన్న మెరికల్లాంటి గ్రేహౌండ్స్ కమాండోలను ఈ ఆపరేషన్‌కు ఎంపిక చేసినట్టు తెలుస్తోంది.
పోలీసులకు సహకరించిన కోవర్టులు?
సోమవారం జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌కు మావోయిస్ట్‌ల్లోని కోవర్టులే కారణమని తెలిసింది. వీరి సహకారంతోనే గ్రేహౌండ్స్ బలగాలు కటాఫ్ ఏరియాలోకి ప్రవేశించినట్టు సమాచారం. కోవర్టులే లేకపోతే, గ్రేహౌండ్స్ బలగాలు అక్కడ అడుగు పెట్టలేవన్న కథనాలు కూడా వినిపిస్తున్నాయి. ఉన్నతాధికారులు వేసిన స్కెచ్‌ను గ్రేహౌండ్స్ అమలు చేయడం గమనార్హం.