రాష్ట్రీయం

సచివాలయ భవనాలపై సబ్ కమిటీ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, అక్టోబర్ 27: హైదరాబాద్ సచివాలయంలోని ఏపి భవనాలను తెలంగాణ ప్రభుత్వానికి కేటాయించే అంశంలో విమర్శలు తలెత్తకుండా అన్ని రకాల ముందు జాగ్రత్తలు తీసుకోవాలని తెదేపా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ అంశంలో రాజకీయ పార్టీలు, ప్రజలు, ప్రజాసంఘాల నుంచి సెంటిమెంటుపరమైన భావన రాకుండా ఆచితూచి అడుగులు వేయనుంది.
ఏపికి చెందిన ఐదు బ్లాకులను తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చేయాలని బాబు ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించిందన్న వార్తలపై అప్పుడే స్పందనలు ప్రారంభమయ్యాయి. దీనిని వైసీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని, కేసీఆర్‌కు భయపడి పదేళ్లు ఉన్న ఉమ్మడి హక్కు వదులుకుని దుకాణం సర్దుకురావడమేమిటని వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి ప్రశ్నించారు. దీన్నిబట్టి వైకాపా దీనిని ముందు రాజకీయ అంశంగా ప్రారంభించి, తర్వాత సెంటిమెంటు అంశంగా స్థిరపరిచే ఎత్తుగడలో ఉందని తెదేపా నాయకత్వం గ్రహించింది. అలాంటి భావన ప్రజల్లో స్థిరపడితే ప్రమాదమని గ్రహించిన ప్రభుత్వం, దానిపై క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటుచేయాలని యోచిస్తున్నట్లు సమాచారం.
ఈనెలాఖరున జరిగే మంత్రివర్గ భేటీలో క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటుపై ప్రకటన ఉండవచ్చని తెలుస్తోంది. ఏపి భవనాలను తెలంగాణకు ఏకపక్షంగా ఇచ్చేశారని, పదేళ్ల ఉమ్మడి హక్కు వదులుకున్నారన్న అపప్రద రాకుండా అన్ని వర్గాల అభిప్రాయాలను ప్రతిబింబించి నిర్ణయం తీసుకున్నారన్న భావన కల్పించేందుకు ఈ సబ్ కమిటీ ఏర్పాటుచేయనున్నట్లు తెలుస్తోంది. ఈ కమిటీ రాష్ట్రంలోని అన్ని వర్గాల నుంచి వివిధ రూపాలు, వేదికల ద్వారా అభిప్రాయసేకరణ చేసి నివేదిక సమర్పిస్తుందని చెబుతున్నారు. పక్క రాష్ట్రంతో ఘర్షణ అనవసరమని, అసలు రాష్టమ్రే విడిపోయిన తర్వాత అక్కడ భవనాలు ఉంటే ఎంత? ఉండకపోతే ఎంత? దానిబదులు ఇక్కడే అమరావతిలో ఎంత త్వరగా భవనాలు నిర్మిస్తే అంత మంచిదన్న భావన మెజారిటీ ప్రజల్లో ఉంది.
అయితే, ముందుగానే తెలంగాణకు ఇచ్చేయడాన్ని వైకాపా సెంటిమెంటు భావనగా రగిలించేందుకు సిద్ధమవుతున్నందున ఆ పార్టీకి అలాంటి అవకాశం ఇవ్వకూడదని ప్రభుత్వం గట్టిగా భావిస్తోంది. అవసరమైతే సబ్ కమిటీకి సలహా ఇచ్చేందుకు వివిధ రంగాలతో కూడిన వారితో సలహాకమిటీ కూడా ఏర్పాటు చేయవచ్చంటున్నారు.
ఫలితంగా అన్ని వర్గాల మనోభావాలను కమిటీ ప్రతిబింబిస్తుందని, దానిపై నిర్ణయం తీసుకుంటే ప్రభుత్వానికీ ఎలాంటి మచ్చ రాదని అంచనా వేస్తున్నారు.