ఆంధ్రప్రదేశ్‌

అవధూత జీవసమాధి ప్రకటన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నార్పల, అక్టోబర్ 27: జీవసమాధికి సిద్ధమైనట్లు ఓ అవధూత చేసిన ప్రకటన అనంతపురం జిల్లాలో కలకలం రేపింది. గురువారం 4 గంటలకు తాను జీవసమాధి అవుతున్నట్లు నార్పల మండలం కురగానిపల్లి గ్రామానికి చెందిన అవధూత నర్సిరెడ్డి(92) ప్రకటించారు. దీంతో ఆయన కుటుంబసభ్యులు, బంధువులు, శిష్యులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. నర్శిరెడ్డి గ్రామంలో పెద్ద మోతుబరి. 1973 సంవత్సరం నుండి ఆయన ఆధ్యాత్మికత వైపు మళ్లాడు. జిల్లా వ్యాప్తంగా పర్యటించి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చారు. ఐదేళ్ల క్రితం దాతల విరాళాలతో స్వగ్రామంలోనే స్వరాజ్య ఆశ్రమం నిర్మించారు. ముందస్తు ప్రణాళికతో ఆశ్రమంలోని గర్భగుడిలో జీవసమాధి కోసం కొంతస్థలాన్ని కేటాయించుకున్నారు. కుమారులను పిలిచించి తాను 4 గంటలకు జీవసమాధి కానున్నానని తెలిపారు. విషయం తెలిసి జిల్లావ్యాప్తంగా ఉన్న అవధూత శిష్యులు, భక్తులు పెద్దసంఖ్యలో గ్రామానికి చేరుకున్నారు. సమాచారం పోలీసులకు తెలియడంతో వారు గ్రామానికి చేరుకుని జీవసమాధి కావడమంటే ఆత్మహత్యతో సమానమని, అది నేరమని, ఈ నిర్ణయం మానుకోవాలని నచ్చజెప్పారు. ససేమిరా అన్న అవధూత నిర్ణయించుకున్న సమయానికి తనువు చాలిస్తానని స్పష్టం చేశారు. సాయంత్రం నాలుగు గంటల వరకు భక్తులు, పోలీసులు ఉత్కంఠగా ఎదురుచూశారు.తహసీల్దారు విజయలక్ష్మి నర్శిరెడ్డితో మాట్లాడారు. గ్రహాలు అనుకూలించలేదని తెల్లవారుజామున 4 గంటలకు తనువు చాలిస్తానని అన్నారు.

చిత్రం.. నర్శిరెడ్డి అవధూత