ఆంధ్రప్రదేశ్‌

జిజిహెచ్ ప్రొఫెసర్ సస్పెన్షన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, అక్టోబర్ 27: జూనియర్ డాక్టర్ సంధ్యారాణి ఆత్మహత్యకు తన వేధింపులే కారణమన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న గుంటూరు ప్రభుత్వాసుపత్రి గైనకాలజీ విభాగ ప్రొఫెసర్ డాక్టర్ ఎవివి లక్ష్మిని సస్పెండ్ చేస్తూ గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. గుంటూరు మెడికల్ కళాశాలలో పిజి చేస్తున్న డాక్టర్ సంధ్యారాణి ప్రొఫెసర్ లక్ష్మి వేధింపుల కారణంగా 4 రోజుల క్రితం ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు కారణమైన లక్ష్మిపై కఠిన చర్యలు తీసుకోవాలని, విధుల నుండి సస్పెండ్ చేయాలని కోరుతూ మెడికోలు, జూనియర్ డాక్టర్లు మూడు రోజులుగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. దీంతో స్పందించిన ప్రభుత్వం ప్రొఫెసర్ లక్ష్మిని సస్పెండ్ చేయాలని జిజిహెచ్ సూపరింటెండెంట్‌ను ఆదేశించడంతో పాటు, త్రిసభ్య కమిటీ ఏర్పాటుకై కలెక్టర్‌ను ఆదేశించింది. ఇలా ఉండగా ఆత్మహత్య చేసుకున్న డాక్టర్ బాల సంధ్యారాణి భర్త డాక్టర్ రవి బుధవారం రాత్రి మిర్యాలగూడలోని తన నివాసంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించారు. సంధ్యారాణిపై వస్తున్న ఆరోపణలతో తీవ్ర మనస్థాపానికి గురైన రవి ఆత్మహత్యకు ప్రయత్నించగా, సంధ్యారాణి తండ్రి సత్తయ్య గుండెపోటుకు గురై మిర్యాలగూడలో చికిత్స పొందుతున్నారు.