ఆంధ్రప్రదేశ్‌

ఎఒబి ఎన్‌కౌంటర్‌తో పల్నాడులో ఉత్కంఠ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, అక్టోబర్ 28: ఆంధ్ర - ఒరిస్సా సరిహద్దు ప్రాంతంలో జరుగుతున్న ఎన్‌కౌంటర్లతో గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో ఉత్కంఠ నెలకొంది. మావోయిస్టు అగ్రనేత అక్కిరాజు హరగోపాల్ అలియాస్ ఆర్‌కె స్వగ్రామం తుమృకోటలో ఎడతెగని చర్చలు జరుగుతున్నాయి. నల్లమల అటవీ ప్రాంతంలో ఒకానొకప్పుడు పోలీసులకు సవాల్ విసిరిన జిల్లాకు చెందిన మావోయిస్టు ముఖ్యనేతలు దాదాపు ఏఒబిలోనే తలదాచుకుంటున్నట్లు సమాచారం. విప్లవోద్యమంలో ప్రధాన భూమిక వహిస్తున్న ఆర్‌కె తుమృకోటలో పాఠశాల విద్య అనంతరం మాచర్ల ఎస్‌కెబిఆర్ కళాశాలలో డిగ్రీ వరకు చదివారు. తండ్రి సత్యానందరావు స్వగ్రామంలోని ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయునిగా పనిచేశారు. సంప్రదాయక కుటుంబంలో జన్మించిన ఆర్‌కె తండ్రికి చేదోడువాదోడుగా ఉంటూ చదువుకున్న పాఠశాలలోనే కొన్నాళ్లు ఉపాధ్యాయునిగా పనిచేశారు. అదే సమయంలో పల్నాడు ప్రాంతంలో మావోయిస్టు ఉద్యమం తారస్థాయికి చేరింది. పార్టీ సమావేశాలకు హాజరైన ఆర్‌కె రాడికల్ సిద్ధాంతాలకు ఆకర్షితుడయ్యారు. 1979 నుంచి అజ్ఞాతంలోకి వెళ్లారు. యుద్ధతంత్రంలో ఆరితేరిన ఆర్‌కె పార్టీ క్యాడర్‌లో అంచలంచెలుగా ఎదిగారు. వైఎస్ సర్కార్‌తో చర్చల సందర్భంగా ప్రకాశం జిల్లా చినకోరుట్ల, గుంటూరు జిల్లా సరిహద్దు అటవీ ప్రాంతంలో నుంచి బాహ్యప్రపంచంలోకి అడుగిడిన నేపథ్యంలో పోలీసులు అనుపానులు తెలుసుకుని నల్లమల అటవీ ప్రాంతాన్ని జల్లెడపట్టారు. పీపుల్స్‌వార్ పార్టీ మావోయిస్టు పార్టీగా రూపాంతరం చెందిన అనంతరం రాష్ట్ర కమిటీ నుంచి కేంద్ర కమిటీ కార్యదర్శి స్థాయి పొందారు. విప్లవోద్యమ ప్రతిఘటన ఎక్కడ తీవ్రస్థాయిలో ఉంటే అక్కడ ఆర్‌కె ఉంటాడనేది పోలీసుల భావన. రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించిన తొలిరోజుల్లోనే పల్నాడు ప్రాంతంలోని చంద్రవంక దిబ్బ వద్ద ఎన్‌కౌంటర్ జరిగింది. అప్పట్లో తృటిలో తప్పించుకున్న ఆర్‌కె ఏఒబిలో పోలీసుల చక్రబంధంలో చిక్కుకున్నాడనే వార్తలు వెలువడటం కలకలం మొదలైంది. ఆర్‌కెకు సోదరి, నలుగురు సోదరులు ఉన్నారు. వీరంతా జీవనోపాధి కోసం గ్రామం విడిచి వెళ్లారు. కాగా తండ్రి సత్యానందరావును గ్రామస్థులు అమితంగా ఆరాధిస్తారు. ఈ క్రమంలోనే ఆయన విగ్రహాన్ని కూడా పాఠశాల ఆవరణలో ప్రతిష్ఠించారు. మూడున్నర దశాబ్దాల క్రితం గ్రామం వీడి వెళ్లిన నేపథ్యంలో ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన మున్నా ఆర్‌కె తనయుడనే విషయం తెలిసి గ్రామస్థులు నిర్ఘాంతపోయారు.

చిత్రం.. ఆర్‌కె స్వగ్రామం తుమృకోట