ఆంధ్రప్రదేశ్‌

ప.గో.లో రైఫిల్ మిస్‌ఫైర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, అక్టోబర్ 28 : పశ్చిమగోదావరి జిల్లా ఎస్‌పి కార్యాలయం ప్రాంగణంలోని ఆయుధ మరమ్మతు కేంద్రంలో శుక్రవారం ఒక రైఫిల్ మిస్‌ఫైర్ కావడంతో ఒక కానిస్టేబుల్ గాయపడ్డాడు. వివరాలిలా వున్నాయి. జిల్లా పోలీసు కార్యాలయం ప్రాంగణంలోనే ఆయుధ మరమ్మతు కేంద్రం వుంది. శనివారం జిల్లాలో ఫైరింగ్ రేంజ్ కార్యక్రమం జరగనున్న నేపధ్యంలో శుక్రవారం ఈ కేంద్రంలో ఆయుధాల పరిశీలన, మరమ్మతులు చేపట్టారు. ఈ సందర్భంగానే ఎన్‌సిసికి చెందిన 0.22 రైఫిల్‌ను పరిశీలిస్తుండగా ప్రమాదవశాత్తూ అది మిస్‌ఫైర్ అయ్యింది. ఈ ప్రమాదంలో అనంతపల్లి పోలీసుస్టేషన్‌లో పనిచేస్తూ ప్రస్తుతం జిల్లా పోలీసు శిక్షణా కేంద్రంలో శిక్షణ పొందుతున్న జి రాజబాబు (పిసి నెం. 1540) గాయపడ్డాడు. మిస్‌ఫైర్ అయిన రైఫిల్ నుంచి బులెట్ అతని తలపై నుంచి దూసుకుపోయింది. ప్రమాదం జరిగిన వెంటనే మరమ్మతు కేంద్రం ఇన్‌ఛార్జి హెడ్ కానిస్టేబుల్ వరదరాజులు తదితరులు గాయపడిన రాజబాబును ఏలూరు ఆసుపత్రికి తరలించారు. రాజబాబు పరిస్థితి క్షేమంగానే ఉందని సమాచారం.