ఆంధ్రప్రదేశ్‌

లక్ష కోట్లతో రాష్ట్రంలో విద్యుత్ వ్యవస్థ బలోపేతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 28: వచ్చే ఐదేళ్లలో రాష్ట్ర విద్యుత్ రంగంలో లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. మిగులు విద్యుత్‌ను సాధించిన నవ్యాంధ్ర ప్రదేశ్‌లో కోటిన్నర కుటుంబాలకు నాణ్యమైన విద్యుత్‌ను అందించడంలో ప్రపంచంతో పోటీపడాలని ఆయన అన్నారు. రాష్ట్రంలో విద్యుత్ రంగంపై ఆ శాఖ ఉన్నతాధికారులతో శుక్రవారం ఆయన అమరావతిలో టెలికాన్ఫరెన్సు నిర్వహించారు. పోలవరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించనున్న జల విద్యుత్ కేంద్రం పూర్తయితే వినియోగదారులకు చౌకగా విద్యుత్ సరఫరా చేస్తామన్నారు. విద్యుత్ రంగంలో రాష్ట్రం సాధిస్తున్న ప్రగతి పట్ల అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు ఆసక్తి ప్రదర్శించడమే కాకుండా ఆర్థిక సహకారం అందించేందుకు ముందుకు వస్తున్నాయన్నారు. ఇప్పటికే రూ.2,500 కోట్ల రుణాన్ని ఇచ్చిన ప్రపంచ బ్యాంకు రాష్ట్రంలో విద్యుత్ వ్యవస్థ బలోపేతానికి సంబంధించిన ఆధునీకరణ పనుల కోసం తక్కువ వడ్డీతో రూ.9 వేల కోట్ల రుణాన్ని అందజేసేందుకు ముందుకు వచ్చిందని వెల్లడించారు. అలాగే కేంద్ర ప్రభుత్వ రంగంలోని పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, గ్రామీణ విద్యుత్ సంస్థ కూడా రాష్ట్రానికి సంపూర్ణ సహకారాన్ని అందిస్తున్నాయని, దీన్‌దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ విద్యుద్దీకరణ, సమ్మిళిత విద్యుత్ అభివృద్ధి పథకాల కింద ఈ సంస్థలు రూ.1,500 కోట్ల నిధులు మంజూరు చేశాయని తెలిపారు. విద్యుత్ సంరక్షణ పథకాల కోసం ఐదేళ్లలో రూ.5000 కోట్లను వ్యయం చేసేందుకు సమ్మతించిన కేంద్ర ప్రభుత్వం సౌర పార్కులకు రూ.800 కోట్ల గ్రాంటు మంజూరు చేస్తుందన్నారు. నష్టాల్లో ఉన్న డిస్కమ్‌లకు చేయూతనిచ్చేందుకు చేపట్టిన ‘ఉదయ్’ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన రూ.8,256 కోట్ల సెక్యూరిటీ బాండ్లలో వివిధ బ్యాంకులు, బీమా, ఆర్థిక సంస్థలు రూ.7,376 కోట్ల బాండ్లను కొనుగోలు చేయడం అత్యంత ప్రోత్సాహకర పరిణామమన్నారు. రాష్ట్రంలో విద్యుత్ సరఫరా వ్యవస్ధను బలోపేతం చేసేందుకు ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్ సబ్ స్టేషన్ నెట్‌వర్క్‌ను మెరుగుపరుస్తామని, ఇందుకోసం 2018 నాటికి రూ.13 వేల కోట్లను వెచ్చిస్తామని వివరించారు. విశాఖపట్నంలో మొదటగా రూ.720 కోట్లతో భూగర్భ విద్యుత్ లైన్లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో అందరికీ నిరంతర విద్యుత్‌ను అందించేందుకు వీలుగా ప్రపంచ శ్రేణి సాంకేతిక విధానాలను అమలు చేస్తున్నామని ఇంధన శాఖ కార్యదర్శి అజయ్ జైన్, ట్రాన్స్‌కో సిఎండి విజయానంద్ ముఖ్యమంత్రికి వివరించారు.