తెలంగాణ

20చోట్ల ఆయుష్ ఆస్పత్రులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 28: రాష్ట్రంలోని 20 ప్రాంతాల్లో 20 పడకల ఆయుష్ ఆస్పత్రులను ఏర్పాటు చేయనున్నట్టు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తరహాలోనే తెలంగాణ రాష్ట్రం కూడా ఆయుష్ వైద్య విధానం, ఆయుర్వేదానికి తగిన గుర్తింపుతోనే అభివృద్ధి పరచడానికి చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ప్రజాభిరుచికి తగ్గట్టుగా వైద్యాన్ని అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. ఆయుష్ వైద్య సేవలు ఒకేచోట అందే విధంగా చూస్తామని అన్నారు.
ఎర్రగడ్డలోని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో ధన్వంతరి జయంతిని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి లక్ష్మారెడ్డి ఆయుర్వేదం ప్రపంచంలోనే అత్యంత ప్రజాధరణ పొందిన వైద్య విధానమని తెలిపారు. అల్లోపతి వైద్యం అందుబాటులోకి వచ్చాక ఆదరణ తగ్గిందని, ఆయుర్వేదానికి పూర్వవైభవం తేవాలని అన్నారు. ప్రత్యామ్నాయ ఔషధాల వైపు ప్రపంచం మళ్లీ చూస్తోందని చెప్పారు. భారత వైద్యం ప్రపంచంలోనే గుర్తింపు పొందిన వైద్యమని, కేంద్ర ప్రభుత్వం మంత్రిత్వశాఖను ఏర్పాటు చేయడం ఈ వైద్య ప్రాముఖ్యతకు నిదర్శనం అని అన్నారు. ప్రకృతి వైద్య విధానానికి ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. ఆయుర్వేద కాలేజీ అభివృద్ధికి పాటు పడతామని చెప్పారు. ఆయుర్వేద వైద్య ఖాళీల భర్తీ, కొత్త పోస్తుల నియామకాలు చేపడతామని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మాగుంట గోపీనాథ్, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్, జిహెచ్‌ఎంసి డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ తివారి, ఆయుష్ కమిషనర్ రాజేందర్‌రెడ్డి, కాలేజీ ప్రిన్సిపాల్ ప్రవీణ్‌కుమార్, ప్రముఖ ఆయుర్వేద వైద్యులు పాల్గొన్నారు.

ధన్వంతరి జయంతి కార్యక్రమంలో ప్రసంగిస్తున్న ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి

కొత్త జిల్లాలకు
కన్వీనర్ల నియామకం
టి.టిడిపి నిర్ణయం
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, అక్టోబర్ 28: కొత్తగా ఏర్పడిన జిల్లాలకు కన్వీనర్లను, కమిటీలను నియమించాలని తెలంగాణ తెలుగు దేశం పార్టీ రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది. శుక్రవారం టి.టిడిపి ముఖ్య నేతల సమావేశం జరిగింది. సభ్యత్వ నమోదు కార్యక్రమం, సంస్థాగత ఎన్నికల నిర్వహణ, జిల్లా స్థాయి, మండల స్థాయి కమిటీలను ఏర్పాటు చేయడంపై దృష్టి సారించాలని నిర్ణయించారు. 1 నుంచి సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టనున్నారు. సమావేశానంతరం పార్టీ నాయకులు అరికెల నర్సారెడ్డి, తూళ్ళ వీరేందర్ గౌడ్, అమర్‌నాథ్ బాబు మీడియాతో మాట్లాడుతూ ఎక్కడా లేని విధంగా తమ పార్టీ కార్యకర్తలకు గుర్తింపు కార్డులు, బీమా ప్రయోజనాలను కల్పించామని చెప్పారు.

గీతంలో డిఎస్టీ సైన్స్
ఇంజనీరింగ్ రీసెర్చి బోర్డు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, అక్టోబర్ 28: గీతం విశ్వవిద్యాలయంలో కేంద్ర శాస్తవ్రిజ్ఞాన శాఖ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రీసెర్చిబోర్డుకు అనుమతి మంజూరు చేసింది. హైదరాబాద్ ప్రాంగణంలోని ఫిజిక్స్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్లు డాక్టర్ రాకేష్ కుమార్ రాజబోయిన, డాక్టర్ పడాల మిస్సాక్ స్వరూప్‌రాజులకు సంయుక్తంగా పరిశోధనలు చేసేందుకు ఈ ప్రాజెక్టును మంజూరు చేసింది. మూడేళ్ల పాటు ఈ ప్రాజెక్టు ఉంటుందని, ఎనర్జీ హార్వెస్టింగ్, సెల్ఫ్ పవర్డు సెన్సార్ అప్లికేషన్స్ రంగంలో ఆసక్తి ఉన్న వారు సంప్రదించవచ్చని ప్రో వైస్ ఛాన్సలర్ ఎన్ శివప్రసాద్ పేర్కొన్నారు.

బిసి రిజర్వేషన్లు
50శాతానికి పెంచాలి

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, అక్టోబర్ 28: జనాభా దామాషా ప్రకారం బిసి రిజర్వేషన్లను 50 శాతానికి పెంచి ఆ తర్వాత ఎవరికి రిజర్వేషన్లు కల్పించినా తమకు అభ్యంతరం లేదని బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య తెలిపారు. బిసి రిజర్వేషన్లపై తమిళనాడు విధానాన్ని అవలంబిస్తామని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు చెప్పడాన్ని స్వాగతిస్తున్నామని ఆయన శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అయితే 50 శాతానికి బిసి రిజర్వేషన్లను పెంచి ఆ తర్వాత ఎవరికి రిజర్వేషన్లు కల్పించినా తమకు అభ్యంతరం లేదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సేకరించిన సామాజిక సర్వే లెక్కలను వెల్లడిస్తే రిజర్వేషన్లు పెంచడానికి ప్రభుత్వానికి శాస్ర్తియ ఆధారాలు లభిస్తాయని తెలిపారు.

వెటర్నరీ కోర్సులకు
3నుంచి కౌనె్సలింగ్
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, అక్టోబర్ 28: తెలంగాణ రాష్ట్రంలో వెటర్నరీ, హార్టికల్చర్, అగ్రికల్చర్ కోర్సుల్లో రెండో దశ కౌనె్సలింగ్ షెడ్యూలును ఆయా వర్శిటీలు ప్రకటించాయి. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం , కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయం , పివి నర్సింహారావు వెటర్నరీ విశ్వవిద్యాలయాలకు సంబంధించి అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులకు బైపిసి స్ట్రీమ్‌కు సంబంధించిన రెండవ, చివరి కౌనె్సలింగ్ నవంబర్ 3,4,5 తేదీల్లో నిర్వహించనున్నారు. మొదటి దశ కౌనె్సలింగ్ తర్వాత వివిధ కోర్సుల్లో ఏర్పడిన ఖాళీలను భర్తీ చేసేందుకు రెండో విడత కౌనె్సలింగ్ నిర్వహిస్తున్నట్టు వర్శిటీ రిజిస్ట్రార్ డాక్టర్ ఎస్ సుధీర్‌కుమార్ తెలిపారు. తెలంగాణ ఎమ్సెట్-1 ర్యాంకుల ఆధారంగానే ఈ కౌనె్సలింగ్ జరుగుతుందని, అన్ని వర్శిటీల వెబ్‌సైట్లలో రెండో కౌనె్సలింగ్ వివరాలు పొందుపరిచామని రిజిస్ట్రార్ చెప్పారు.