ఆంధ్రప్రదేశ్‌

ఏం సాధించారని పొగడ్తలు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 29: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు శంకుస్థాపనల పిచ్చి పట్టిందని ఏపి కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ ఎన్.రఘువీరారెడ్డి విమర్శించారు. రాష్ట్రానికి చంద్రబాబు ఏమీ ఒరగబెట్టకపోయినప్పటికీ శంకుస్థాపన పేరిట శుక్రవారం ఏర్పాటు చేసిన సభలో ఆయనను కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, వెంకయ్య నాయుడు పొగడ్తలతో ముంచెత్తారని రఘువీరారెడ్డి శనివారం విలేఖరుల సమావేశంలో ధ్వజమెత్తారు. రాష్ట్ర విభజన జరిగి రెండున్నర సంవత్సరాలు దాటిందని, ఈ మధ్య కాలంలో తొలుత గత ఏడాది జూన్ 6న తాళ్లయిపాలెంలో కుటుంబ సభ్యులతో కలిసి శంకుస్థాపన చేసిన చంద్రబాబు, గతేడాది అక్టోబర్ 22న దసరా పండుగ నాడు ఉద్దండరాయుని పాలెంలో ప్రధాని నరేంద్ర మోదీ, ఇతర కేంద్ర మంత్రులు, చీఫ్ జస్టిస్ అధ్వర్యంలో సుమారు 400 కోట్ల రూపాయల వ్యయంతో భారీగా శంకుస్థాపనలు చేశారని, అలాగే ఈ ఏడాది ఫిబ్రవరి 17న తాత్కాలిక సచివాలయానికి, ఇప్పుడు కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ, వెంకయ్య నాయుడు చేతుల మీదుగా పరిపాలనా భవనాలకు శంకుస్థాపనలు చేశారని రఘువీరారెడ్డి గుర్తుచేస్తూ, ఇలా ఇంకా ఎన్ని శంకుస్థాపనలు చేస్తారోనని అన్నారు. పరిపాలనా భవనాలకు ఎటువంటి ప్లానింగ్, టెండర్లు లేకపోయినప్పటికీ శుక్రవారం శంకుస్థాపన కార్యక్రమం పేరుతో పరస్పరం అభినందించుకోవడానికి పరిమితమయ్యారని రఘువీరారెడ్డి విమర్శించారు.
ఏపి శాసనమండలి ప్రతిపక్ష నేత సి.రామచంద్రయ్య మాట్లాడుతూ, చంద్రబాబు పాలనను ప్రజలు అసహ్యించుకుంటున్నారని, ఆయన మంచి పాలన అందిస్తున్నట్లు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు. ప్రత్యేక హోదా సాధించేందుకు పార్టీలకు అతీతంగా ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటం చేస్తామని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు ఎన్.తులసిరెడ్డి, ఎస్.శైలజానాథ్, గిడుగు రుద్రరాజు, జంగా గౌతమ్ కూడా పాల్గొన్నారు.