ఆంధ్రప్రదేశ్‌

ఆంధ్రాను మోసగించే కబుర్లు చాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 29: ఆంధ్రాకు ప్రత్యేక హోదా తెచ్చే ప్రయత్నం చేయకుండా నిధులు లేని ప్యాకేజీ ఇచ్చిన కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీని పొగిడి ఐదు కోట్ల ఆంధ్రులను ముఖ్యమంత్రి చంద్రబాబు అవమానించారని వైకాపా సీనియర్ నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు.
శనివారం ఇక్కడ ఆయన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ హోదా తీసుకువచ్చే సత్తా లేకపోతే పదవి నుంచి తప్పుకోవాలని ఆయన చంద్రబాబును డిమాండ్ చేశారు. ఏపి ప్రజలు చంద్రబాబు చర్యలను గమనిస్తున్నారని, వారేమే అమాయకులు కారన్నారు. ఏ రాష్ట్రానికీ ఇవ్వని ప్యాకేజీ ఆంధ్రాకు ఇచ్చామని జైట్లీ చెప్పడం తప్పన్నారు. ఐఐటి, ఐఐఎం వంటి కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థలను అన్ని రాష్ట్రాలకు మంజూరు చేశారన్నారు. చిన్న రాష్టమ్రైన చత్తీస్‌గఢ్‌లోనే అన్ని జాతీయ విద్యా సంస్థలున్నాయన్నారు. ఏ చట్టంలో ఉందని గుజరాత్‌కు రైల్వే వర్శిటీని ఇచ్చారని ప్రశ్నించారు. మన్నవరంలో బిహెచ్‌ఇఎల్, ఎన్టీపిసి జాయింట్ వెంచర్‌ను మూసివేసేందుకు కుట్ర జరుగుతుంటే చంద్రబాబు చోద్యం చూస్తున్నారన్నారు. ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమల ఏర్పాటుకు రాయితీలు వస్తాయని, స్థానికులకు ఉద్యోగాలు వస్తాయన్నారు. ఈ వాస్తవాన్ని దాచి పెట్టి అవాస్తవాలను బిజెపి, టిడిపి మంత్రులు ప్రచారం చేస్తున్నారన్నారు. ఫైనాన్స్ కమిషన్ సిఫారసుల ప్రకారం 42 శాతం పన్నుల వాటాగా ఏపికి వచ్చేది 1.69 లక్షల కోట్లని, దీనికి రెవెన్యూ లోటు పూడ్చే గ్రాంటు, స్థానిక సంస్థల గ్రాంటును కలిపితే 2.03 లక్షల కోట్ల నిధులు వస్తాయన్నారు. తాము అన్యాయం చేసిన రాష్ట్రంలోనే సన్మాన సభలను ఏర్పాటు చేయించుకుని దండలు వేయించుకునే సంస్కృతికి బిజెపి నేతలు అలవాటుపడ్డారన్నారు. కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, అరుణ్‌జైట్లీ విజయవాడ సభలో అభూతకల్పనలతో, సత్యదూరమైన ప్రకటనలను ప్రజలను మభ్యపెట్టారని ఆయన ధ్వజమెత్తారు.