ఆంధ్రప్రదేశ్‌

తాగునీటికి రూ.4,500 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, అక్టోబర్ 29: రాష్ట్రంలో రాయలసీమ, దక్షిణ కోస్తాలో తాగునీటి ఎద్దడి నివారణకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. నీటి సరఫరా విభాగం సలహాదారు కొండలరావుతో విశాఖలో శనివారం భేటీ అయిన మంత్రి అయ్యన్న పలు అంశాలపై చర్చించారు. చిత్తూరు, కర్నూలు, అనంతపురం, కడప, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు జిల్లాల్లో తాగునీటి సౌకర్యం కల్పనకు రూ.4,500 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేయాలని తాగునీటి కల్పనకు ప్రపంచ బ్యాంకు సంసిద్ధత వ్యక్తం చేసిన నేపథ్యంలో ముందుగా ప్రతిపాదనలు సిద్ధం చేయలన్నారు. ప్రతిపాదనలకు ఆర్థిక శాఖ ఆమోదం లభిస్తే అనంతరం ప్రపంచ బ్యాంకుకు పంపేందుకు వీలవుతుందన్నారు. రాష్ట్రంలోని పలు జిల్లాలో నాబార్డ్ ద్వారా మంజూరైన రూ.171 కోట్లతో చేపట్టిన తాగునీటి పథకాలపై ఆయన సలహాదారుతో సమీక్షించారు. తక్షణమే పనులు చేపట్టే విధంగా టెండర్లను పిలిచి, వచ్చే వేసవి నాటికి పథకాలను అమల్లోకి తీసుకురావాలని స్పష్టం చేశారు.