ఆంధ్రప్రదేశ్‌

కల్కి భగవాన్ క్షేమం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరదయ్యపాళెం, అక్టోబర్ 29: ప్రముఖ ఆధ్యాత్మిక గురువుకల్కి భగవాన్ ఆరోగ్యంగా ఉన్నారని, కల్కి ఆశ్రమ ట్రస్టు నిర్వాహకులు లోకేష్ దాసాజీ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆధ్యాత్మిక గురువు కల్కి భగవాన్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. చెన్నై అపోలోలో క్రిటికల్ యూనిట్‌లో చికిత్స చేయిస్తున్నారని జరుగుతున్న ప్రచారం సత్యదూరం అన్నారు. దైనందిన ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఆయన నిమగ్నమై ఉన్నారన్నారు. 3రోజుల క్రితం చెన్నై అపోలో ఆసుపత్రిలో సాధారణ ఆరోగ్య పరీక్షలు చేయించుకొని ఆయన ఆశ్రమానికి వచ్చారన్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా కొన్ని పత్రికలు వార్తలు ప్రచురించడంతో భక్తులు ఆందోళనకు గురయ్యారన్నారు. భగవాన్ భక్తులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరంలేదన్నారు.