ఆంధ్రప్రదేశ్‌

మావోల్లో ప్రతీకారేచ్ఛ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, అక్టోబర్ 29: ఎఒబిలో ఉద్రిక్త వాతావరణం ఇంకా కొనసాగుతునే ఉంది. ఎప్పటికప్పుడు మావోల ప్లీనరీలపై కోవర్టులతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కాల్పులకు తెగబడుతోందని, దీనికి నిరసనగా వచ్చే నెల 3న మావోలు ఎఒబి బంద్‌కు పిలుపునిచ్చింది. ఆంధ్రప్రదేశ్‌తోపాటు ఒడిశా, ఛత్తీస్‌ఘడ్, తెలంగాణ, మహారాష్ట్ర రాష్ట్రాల్లో మావోల బంద్‌కు కేంద్ర కమిటీ నేత ప్రతాప్ పిలుపునిస్తూ శనివారం లేఖ విడుదల చేసారు. 1993లో కరీంనగర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్, 97లో నిజామాబాద్, 98, 2016లో ఎఒబిలో మావోలను కోవర్టుల వ్యూహంతో మట్టుబెట్టిన ప్రభుత్వాలు, పాలకులపై ప్రతీకారం తీర్చుకుంటామంటూ మావో కేంద్ర కమిటీ విడుదల చేసిన లేఖలో సుస్పష్టం చేసారు.
ఆంధ్రా, ఒడిశా ముఖ్యమంత్రులు నవీన్ పట్నాయిక్, నారా చంద్రబాబునాయుడు ఈ ఎన్‌కౌంటర్‌కు మూల్యం చెల్లించుకోవల్సిందేనంటూ కేంద్ర కమిటీ అల్టిమేటం ఇచ్చింది. ఇందులో భాగంగానే ఎవోబీలో నవంబర్ 3న బంద్ నిర్వహిస్తున్నామంటూ మావోల నేత ప్రతాప్ హెచ్చరించారు. అలాగే, బాక్సైట్ తవ్వకాలు, మన్యంలో ఖనిజసంపదను కొల్లగొట్టేందుకే ఇటువంటి అప్రజాస్వామిక చర్యలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకున్నాయంటూ ఆ లేఖలో ఆరోపించారు. కోవర్టు వ్యవస్థతో మావోలపై దాడులకు దిగుతున్న వారిపై ప్రతీకార చర్యలు తప్పవంటూ హెచ్చరించారు. ఇదిలా ఉండగా, శ్రీకాకుళం జిల్లాలో మావోల సేఫ్టీ జోన్స్ తెరుచుకునే వ్యూహానికి పదునుపెట్టినట్టు విశ్వసనీయ సమాచారం. తువ్వా కొండలు, మహేంద్రగిరులతోపాటు తూర్పుకనుముల్లో నీరు ప్రవహించే మార్గంలో మావోల వ్యూహానికి రంగం సిద్ధమవుతున్నట్టు ఇంటెలిజెన్స్ అధికారులు ఇప్పటికే రాష్ట్ర హోంశాఖకు సమాచారం పంపినట్టు తెలిస్తోంది. ఎవోబీ బంద్ పిలుపు మేరకు జిల్లా ఎస్పీ జె.బ్రహ్మారెడ్డి ఉన్నతాధికారులతో అత్యవసర రహస్య సమావేశం నిర్వహించినట్టు సమాచారం. ఈ మేరకు ఎవోబీకి ఆనుకుని ఉన్న మెళియాపుట్టి, మందస, వజ్రపుకొత్తూరు, భామిని, కొత్తూరు, సీతంపేట వంటి మావో ప్రభావిత ప్రాంతాలతోపాటు మైదాన ప్రాంతాల్లో కూడా స్పెషల్ పోలీసుల బెటాలియన్‌లు పూర్తిస్థాయిలో పహారా ఉండేలా చర్యలకు సన్నద్ధం అవుతున్నారు. ఇటువంటి కట్టుదిట్టమైన బలగాల మధ్యే ఇటీవల మావోలు బంద్ పిలుపునకు ఇచ్చి అవాంఛనీయ సంఘటనలకు రెచ్చగొట్టి ప్రశాంతంగా ఉన్న ఎవోబీ ప్రాంతాల్లో అలజడి సృష్టించి, బాంబుల మోతతో ప్రభుత్వ కార్యాలయాలు, కమ్యూనికేషన్ టవర్స్ పేల్చిన సంఘటనలు ఎవోబీకి కొత్తేమీకాదన్న పాత సంఘటనలను జిల్లా పోలీసుశాఖ అధ్యయనం చేస్తోంది. ఏదిఏమైనప్పటికీ, ఐదు రాష్ట్రాల బంద్ పిలుపుతోపాటు శ్రీకాకుళం జిల్లాలో ఎవోబీ బంద్ పట్ల ఉద్రిక్తత వాతావరణం ఏర్పడంతో రాష్ట్ర కార్మిక మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుకు ప్రత్యేక బలగాలు ఏర్పాటు చేసినట్టు అధికారికంగా తెలిసింది. అలాగే, మావోల పిలుపు మేరకు నవంబర్ 3 వరకూ ప్రజాప్రతినిధులు పర్యటనలు రద్దు చేసుకోవాలంటూ జిల్లా పోలీసుశాఖ సూచించింది.

చిత్రం.. ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన రాందాస్
మృతదేహాన్ని తీసుకెళ్తున్న తండ్రి మల్లేశ్వరరావు