ఆంధ్రప్రదేశ్‌

14 నెలల్లో నిర్మాణాలు పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, అక్టోబర్ 29: నవ్యాంధ్ర రాజధాని నిర్మాణానికి మరో అడుగు పడింది. ముఖ్యమంత్రి ఇచ్చిన పిలుపునకు స్పందించి 33వేల ఎకరాలు ఇచ్చి రైతులు చరిత్ర సృష్టిస్తే, మరో అడుగు వేసే మధ్యలో ఎన్నో సవాళ్లు ఎదుర్కోవలసి వచ్చింది. ఇప్పుడు దానిని కూడా అధిగమించి ఆంధ్ర నవ నిర్మాణంలో ముందడుగు వేయడంపట్ల ప్రజల్లో హర్షాతిరేకం వ్యక్తమవుతోంది. కేంద్ర ఆర్ధిక మంత్రి జైట్లీ చేసిన శంకుస్థాపనతో నవ్యాంధ్ర పాత సమస్యలను మరిచి, కొత్త చరిత్ర ఆవిష్కారం కోసం ప్రయత్నాలు ప్రారంభించినట్టయింది. నిరసనలు, రాజకీయ అడ్డంకులు అన్నీ అధిగమించి అమరావతిలో రాజ్‌భవన్, అసెంబ్లీ, సచివాలయం, మంత్రులు-అధికారుల క్వార్టర్లకు శంకుస్థాపన జరిగింది. గ్రీన్ ట్రిబ్యునల్, సుప్రీంకోర్టులో కేసులే ఈ అనుమానాలకు కారణం. నిర్మాణాలు మొత్తం 14 నెలల్లో పూర్తి అవుతాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. చైనా టెక్నాలజీలో 30 ఫ్లోర్ల బిల్డింగులు కేవలం 45 రోజుల్లోనే నిర్మాణమవుతున్నాయి. ఆ ప్రకారంగా ఆధునిక శాస్త్ర సాంకేతిక పద్ధతులు అనుసరిస్తూ ఈ నిర్మాణాలు 14 నెలల్లో పూర్తవుతాయని అధికారవర్గాలు చెబుతున్నాయి. అయితే, ఈ విషయంలో అన్నింటికంటే డిజైన్ల ఖరారే అసలు సమస్య అని ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు డిజైన్ల విషయంలో రాజీ పడే మనస్తత్వం కాదు. ఒకసారి ఖరారైన డిజైన్లను ఇంకా అంతకంటే మెరుగైన డిజైన్లతో ఎవరైనా వస్తే దానిని కూడా పరిశీలించాలని ఆదేశిస్తుంటారు. ‘సీఎం గారు క్వాలిటీలో ఎక్కడా రాజీ పడరు. అందుకే డిజైన్లు పదే పదే మారిపోతుంటాయి. ఆయనకు ఏదీ ఒక పట్టాన నచ్చదు. మెరుగైన డిజైన్ల కోసం పరితపిస్తుంటారు. కానీ దానివల్ల పనులు అనుకున్న సమయానికి పూర్తి చేయలేకపోతాం. ఒకసారి డిజైన్లు ఖరారైతే ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం 14 నెలల్లో పూర్తి చేయడం ఒక సమస్య కాద’ని ఓ అధికారి వివరించారు. కాగా, ఈ భవనాలు నిర్మాణమయితే బాబు ప్రతిష్ఠ మరింత పెరుగుతుందని రాజకీయ పరిశీలకులు విశే్లషిస్తున్నారు. హైదరాబాద్ సచివాలయం నుంచి ఉద్యోగులను కదిలించడం కష్టమన్న భావన బలంగా ఉండేదని, కానీ వారిని అక్కడి నుంచి మొత్తం ఖాళీ చేయించి వెలగపూడికి తీసుకురాగలిగారని గుర్తు చేస్తున్నారు. తన కార్యాలయం కూడా అక్కడికి తరలించడంతో, రాజధాని నగరంలో నిర్మించబోయే భవన నిర్మాణాలపైనా జనంలో బాబుపై నమ్మకం పెరిగిందని విశే్లషిస్తున్నారు. ఈ నిర్మాణాలు పూర్తయితే మిగిలిన నిర్మాణాలనూ చంద్రబాబు మాత్రమే నిర్మించగలరన్న భరోసా ప్రజల్లో ఏర్పడుతుందని, ఒకరకంగా వచ్చే ఎన్నికల్లో తెదేపా ప్రచారంలో ఇదే కీలక అంశమని జోస్యం చెబుతున్నారు.