ఆంధ్రప్రదేశ్‌

తిరుపతిలోని టిటిడి అద్దె గదులకూ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, అక్టోబర్ 31: తిరుమల శ్రీవారి దర్శనార్థం విచ్చేసే భక్తుల సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకొని తిరుపతిలోని టిటిడి అద్దె గదులకు కూడా కాషన్ డిపాజిట్‌ను రద్దుచేయాలని టిటిడి కార్యనిర్వహణాధికారి డాక్టర్ డి.సాంబశివరావు అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో గల తమ కార్యాలయంలో సోమవారం సీనియర్ అధికారులతో ఇఓ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇఓ మాట్లాడుతూ ఇటీవల తిరుమలలో అద్దె గదులకు కాషన్ డిపాజిట్ రద్దుచేశామని, అదేవిధంగా తిరుపతిలోని శ్రీనివాసం, మాధవం, విష్ణునివాసం, పద్మావతి విశ్రాంతి భవనాలలో కాషన్ డిపాజిట్‌ను రద్దుచేయాలని అధికారులను ఆదేశించారు.
వైభవంగా దీపావళి ఆస్థానం
ఇదిలావుండగా తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం ఉదయం దీపావళి ఆస్థానం అంగరంగ వైభవంగా జరిగింది. ఆలయ అర్చకులు, తిరుమల జియ్యంగార్లు, టిటిడి ఉన్నతాధికారుల సమక్షంలో ఆగమోక్తంగా ఆస్థాన వేడుకలను బంగారువాకిలి చెంత వైభవంగా నిర్వహించారు. శ్రీ మలయప్పస్వామి, అమ్మవార్ల, విష్సక్సేనుల వారి ఉత్సవ మూర్తులను గరుడాళ్వారు సన్నిధిలో అభిముఖంగా ఉంచి ఘనంగా ఆస్థానం నిర్వహించారు. స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి మంగళ హారతులను సమర్పించి ప్రసాద నివేదనలు అర్చకస్వాములు ఆగమోక్తంగా నిర్వహించారు. పట్టు వస్త్ర సమర్పణను మూలవిరాట్, దేవతా ఉత్సవమూర్తులకు ధరింపచేసి రూపాయి హారతి, హారతులను నివేదించారు. దీంతో దీపావళి ఆస్థానం పూర్తయింది.

ఆదివారం శ్రీవారి ఆలయంలో నిర్వహించిన దీపావళి ఆస్థానంలో పాల్గొన్న టిటిడి ఇఓ సాంబశివారావు తదితరులు