తెలంగాణ

కూలనున్న భవనాల వెల రూ.200కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 31: తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి కొత్త భవనాల నిర్మాణం, పాత భవనాల కూల్చివేత.. ఇప్పుడు ప్రజాప్రతినిధులు, అధికారులు, సామాన్య జనం మధ్య ‘హాట్ హాట్ టాపిక్’గా మారింది. దాదాపు నాలుగు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న తెలంగాణ సచివాలయం పాత భవనాల వెల ప్రస్తుత ధరల ప్రకారం ఎంత? అన్న ప్రశ్న వస్తోంది. వీటి ధర 200 కోట్ల రూపాయల వరకు ఉంటుందని ఇంజనీరింగ్ అధికారులు పేర్కొంటున్నారు. పాత భవనాలతో పాటు మంత్రులు, అధికారుల ఛాంబర్లకు చేసిన డెకొరేషన్, కార్డుబోర్డుతో చేసిన సిబ్బంది ఛాంబర్లకు కూడా వెల కట్టాల్సి వస్తోంది. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం నాలుగు భవనాలను (ఎ,బి,సి.డి బ్లాకులు) ఉపయోగించుకుంటోంది. సి-బ్లాకును ముఖ్యమంత్రి కార్యాలయం, ముఖ్యమంత్రి పేషీ, సాధారణపరిపాలనా శాఖ (జిఎడి) అవసరాలకోసం ఉపయోగిస్తున్నారు. ‘డి’ బ్లాకును 2000సంవత్సరంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా నిర్మించారు. అప్పట్లో దీనికి 40 కోట్ల రూపాయలు వ్యయం చేశారు. ‘డి’ బ్లాకులో ప్రస్తుతం తెలంగాణ మంత్రులకు, వివిధ శాఖల అధికారులకు కార్యాలయాలను ఏర్పాటు చేశారు. ఎ,బి బ్లాకులను హోంశాఖతో సహా వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శుల కోసం వినియోగిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతం ఉపయోగిస్తున్న సచివాలయ భవనాలను (ఎ,బి,సి,డి బ్లాకులు) మొత్తాన్ని ఖాళీ చేసి కూల్చివేయాల్సి ఉంటుంది.
కొత్తగా ఐదు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో పది అంతస్థులతో ఇప్పుడున్న డి-బ్లాకు స్థలంలో కొత్తగా అధునాతన భవనం నిర్మించాలని భావిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఆలోచనల మేరకు అన్నీ సజావుగా సాగితే కొత్త భవనాన్ని ఏడాదిలోగా నిర్మించాలని, అంతవరకు మంత్రులు, ఉన్నతాధికారుల ఛాంబర్ల కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణ సచివాలయం ఎదురుగా ఉన్న ఐదు భవనాలు (జె, హెచ్-నార్త్, హెచ్-సౌత్, కె, ఎల్ బ్లాకులు) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉపయోగించుకుంటోంది. ఎపి ప్రభుత్వ ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వివిధ శాఖలకు చెందిన ఇతర కార్యదర్శులు వారి సిబ్బంది కోసం ఎపి ప్రభుత్వం వినియోగించుకుంటోంది. ఎపి ముఖ్యమంత్రి, మంత్రుల కార్యాలయాలు, వివిధ శాఖలన్నీ విజయవాడ, గుంటూరు, అమరావతి తరలిపోవడంతో ఈ భవనాలు ఖాళీ అయ్యాయి. నామమాత్రంగా కొన్ని శాఖలు, కొద్దిమంది సిబ్బంది మాత్రమే ఈ భవనాలను వినియోగించుకుంటున్నారు. సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత దాదాపు ఐదున్నర లక్షల చదరపు అడుగుల వైశాల్యమున్న ఈ భవనాలు ఎపి ప్రభుత్వ అధీనంలోనే నేటికీ ఉన్నాయి. వీటిని తమకు అప్పగించాలని తెలంగాణ ప్రభుత్వం కోరుతోంది. ఈ భవనాలు తెలంగాణకు అప్పగిస్తే తాత్కాలిక అవసరాల కోసం ఉపయోగించుకోవాలని భావిస్తున్నారు.
ఈ మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఇటీవల గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్‌ను కలిసి ఈ మేరకు అభ్యర్థించారు. ఎపి ప్రభుత్వ అధీనంలో ఉన్న సచివాలయ భవనాలు తెలంగాణ ప్రభుత్వానికి అప్పగిస్తే, ఈ భవనాల్లోకి తాత్కాలికంగా తెలంగాణ సచివాలయాన్ని మార్చాలని భావిస్తున్నారు. ఒక వేళ ఈ భవనాలు ఎపి ప్రభుత్వం తమ అధీనంలోనే ఉంచుకోవాలని నిర్ణయిస్తే బూర్గుల రామకృష్ణారావు భవన్ (బిఆర్‌కె భవన్)తో పాటు మరో ఐదు భవనాల్లోకి సచివాలయ కార్యాలయాలను, మంత్రుల ఛాంబర్లను మార్చాలని ఆలోచిస్తున్నారు. ఇప్పటి వరకు వివిధ శాఖలు యథాతథంగా పనిచేస్తున్నాయి. ఏ శాఖకు కూడా ‘షిఫ్టింగ్’కు సంబంధించి అధికారికంగా సమాచారం అందించలేదు. కార్యాలయాల షిఫ్టింగ్ కోసం వౌఖికంగా మాత్రమే సిబ్బందికి పదిరోజుల క్రితం ఆదేశాలు జారీ చేశారు. దాంతో సిబ్బంది తమ ఫైళ్లు, ఇతర సామాగ్రిని మూటకట్టుకుని తదుపరి ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నారు.
chitram...
తెలంగాణ ప్రభుత్వం కూల్చనున్న హైదరాబాద్ సచివాలయంలోని సమతా బ్లాక్, డి.బ్లాక్, నార్త్ హెచ్ బ్లాక్, సౌత్ హెచ్ బ్లాక్, జెబ్లాక్ బిల్డింగ్‌లు