ఆంధ్రప్రదేశ్‌

13 మంది గిరిజనులు ఏమయ్యారు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, అక్టోబర్ 31: జెజ్జంగి ఎన్‌కౌంటర్ మొత్తం వివాదాస్పదమైంది. ఇప్పటికే ఆ ఎన్‌కౌంటర్ బూటకమని ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి. వారి ఆరోపణలపై పోలీసులు సరైన సమాధానం ఇవ్వలేక సతమతమవుతున్నారు. అదేవిధంగా మావోయిస్ట్ అగ్రనేత ఆర్కే మిస్సింగ్ పోలీసుల తలకు చుట్టుకుంది. ఆర్కే భార్య ఏపి హైకోర్టులో అబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేయడంతో ఆర్కే విషయంలో పోలీసులు గుక్క తిప్పుకోలేకపోతున్నారు. ఈ వివాదం సద్దుమణగక ముందే, మల్కన్‌గిరి జిల్లాకు చెందిన 13 మంది గిరిజనులు అదృశ్యమైన ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో ఏఓబిలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఈనెల 24న ఆంధ్ర ఒడిశా సరిహద్దు ప్రాంతంలో భారీ ఎన్‌కౌంటర్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఎన్‌కౌంటర్‌లో మొదట 24 మంది, ఆ తరవాత ఇద్దరు ఎన్‌కౌంటర్‌లో మరణించిన సంగతి తెలిసిందే. ఎన్‌కౌంటర్ జరిగినప్పటి నుంచి మల్కన్‌గిరి జిల్లాకు గుర్రంశెట్టిపాలెం, ఆంత్రాపల్లి గ్రామానికి చెందిన 13 మంది గిరిజనులు ఈనెల 24 నుంచి అదృశ్యమయ్యారు. వీరు ఎన్‌కౌంటర్‌లో చనిపోయారా? లేక వీరంతా పోలీసుల అదుపులో ఉన్నారా? అని తేలకపోవడంతో ఆ గ్రామానికి చెందిన గిరిజనులంతా గత వారం రోజులుగా వీరి కోసం ఎదురు చూస్తున్నారు. ఏఓబిలో బెజ్జంగి కటాఫ్ ఏరియా వద్ద మావోయిస్ట్‌లు ప్లీనరీ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సమావేశానికి సాధారణ గిరిజనులు కూడా హాజరైనట్టు సమాచారం. అయితే, ఎన్‌కౌంటర్‌లో 30 మంది మరణించగా, ఇందులో 27 మంది మావోయిస్ట్‌లేనని వారి పేర్లతో సహా వివరాలు బయటపెట్టారు.
27 మంది వివరాలు
రాష్ట్ర కమిటీ సభ్యులు: దయ అలియాస్ కృష్ణ, గణేష్ అలియాస్ బాకూరి వెంకటరమణ
డివిజన్ కమిటీ సభ్యులు: రైన్ అలియాస్ జలుమూరి శ్రీనుబాబు
ఏరియా కమిటీ సభ్యులు: మధు అలియాస్ అయినపల్లి దాసు, మమత, లత అలియాస్ భారతి, హరి అలియాస్ మురళి సింహాచలం, స్వరూప అలియాస్ రింకి, మున్న, బీర్సు అలియాస్ దిమిలి కేశవరావు
దళ సభ్యులు: గంగాల్ అలియాస్ పికెఎన్ ప్రభాకర్, శే్వత, ఉగ్రి, మురాయి, రాంకి, మల్లేష్, బెంగాల్ సురేష్, రాజన్న, సుధీర్, లత, బిమల్ అలియార్ రాజేశ్వర్, రమేష్, యాంత్రిన్, జ్యోతి, రూపి, దినేష్, జెలీన. వీరిలో సాధారణ పౌరులు ఒక్కరు కూడా లేకపోవడం గమనార్హం. దీంతో ఆంత్రాపల్లిలో 13 మంది గిరిజనులు మాయమవడం వెనుక అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన మావోయిస్ట్‌ల్లో 16 మృత దేహాలను వారి వారి బంధువులకు అప్పగించారు.
12 మృతదేహాలను తీసుకువెళ్లడానికి వారి బంధువులు రాకపోవడంతో 29 సాయంత్రం గుట్టు చప్పుడు కాకుండా ఖననం చేశారు. మరో రెండు మృతదేహాలను మంగళవారం ఖననం చేయనున్నారు. ఖననం చేసిన వారిలో ఆచూకీ తెలియకుండాపోయిన గిరిజనులెవరైనా ఉన్నారా? అని వారి బంధువులు ఆందోళన చెందుతున్నారు. నాలుగు రోజుల తరువాత గిరిజనుల అదృశ్యం విషయం బయటకు రావడంతో మళ్లీ ఏఓబిలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి.
ఎన్‌కౌంటర్ జరిగిన తరువాత పోలీసులు కొంతమందిని అదుపులోకి తీసుకున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. వీరిలో మావోయిస్ట్‌లు ఉన్నారా? లేదా? అన్న సంగతి పక్కన పెడితే, ఈ 13 మంది గిరిజనుల్లో ఎవరైనా ఉన్నారా? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.
మానవ హక్కుల సంఘం విచారణ
ఇదిలా ఉండగా ఈనెల 24న జరిగిన ఎన్‌కౌంటర్‌పై మానవ హక్కుల సంఘం దర్యాప్తు జరపనుంది. ఘటనా స్థలానికి సంఘం ప్రతినిధులు వెళ్లనున్నారు. అలాగే పోలీసు విచారణ కూడా జరుగుతుందని విశాఖ రూరల్ ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ తెలియచేశారు. అలాగే ఆర్కే భార్య శిరీష హైకోర్టుల వేసిన అబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై అఫిడవిట్ దాఖలు చేయలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. దీనిపై ఎస్పీ మాట్లాడుతూ అఫిడవిట్ దాఖలు చేస్తామని చెప్పారు.