ఆంధ్రప్రదేశ్‌

బాలుడిపై సవతితల్లి దాష్టీకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దర్శి,అక్టోబర్ 31:నాలుగు సంవత్సరాల చిన్నారి బాలుడిపై సవతి తల్లిదాష్టికం చూపరులను కంటతడి పెట్టించింది. ప్రకాశం జిల్లా దర్శి మండలంలోని శివరాజ్‌నగర్ గ్రామంలో కల్లూరి బ్రహ్మయ్య అనే నాలుగుసంవత్సరాల బాలుడిపై సవతితల్లి అట్లకాడతో పెట్టిన వాతలు,కొట్టిన దెబ్బలు మానవత్వాన్ని మంటగలిపేలా చేశాయి. కల్లూరి ఆంజనేయులు రాచూరి లక్ష్మి సహజీవనాన్ని కొనసాగిస్తున్నారు. ఆంజనేయులకు నాలుగు సంవత్సరాల బాలుడు ఉన్నాడు. రాచూరి లక్ష్మికి మూడు సంవత్సరాల కూతురు ఉంది. ఆంజనేయులకు మరో మహిళతో సంబంధం ఉందన్న అనుమానంతో లక్ష్మి బాలుడిపట్ల వివక్ష ప్రదర్శిస్తూ రోజూ కొట్టేది. అదే విధంగా ఆదివారం కూడా క్రూరత్వం ప్రదర్శించి తొడపై అట్లకాడతో వాతలు పెట్టడటం, తలప గలకొట్టడటం, మూతిమీద కాల్చటం లాంటి క్రూరమైన చర్యలకు పాల్పడింది. ఆదివారం రాత్రి బాలుడిపై క్రూరత్వాన్ని ప్రదర్శించి లక్ష్మి ఇంటినుండి వెళ్లిపోయింది. బాలుడు ఏడ్చుకుంటూ రోడ్డు మీదకు రావటంతో బాలుడుని చూసిన స్ధానికులు దర్శి ప్రభుత్వ వైద్యశాలకు తరలించి లక్ష్మిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.