ఆంధ్రప్రదేశ్‌

ద్వానాశాస్ర్తీకి కృష్ణమూర్తి సాహిత్య పురస్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, అక్టోబర్ 31: ప్రముఖ సాహితీవేత్త ద్వాదశి నాగేశ్వర శాస్ర్తీ (ద్వానా శాస్ర్తీ)కి ప్రతిష్ఠాత్మక మడుపల్లి కృష్ణమూర్తి సాహిత్య పురస్కారాన్ని అందజేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని కోటదిబ్బ వద్ద వున్న నేరెళ్ల రాజా కళ్యాణ మండపంలో సోమవారం గుప్తా ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని ఆయనకు అందజేశారు.
ఈ పురస్కారం కింద ఆయనకు రూ.2 లక్షల నగదు, ప్రశంసాపత్రం అందించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ ద్వానా శాస్ర్తీ వంటి సాహితీ దిగ్గజాన్ని గౌరవించి కృష్ణమూర్తి పురస్కారాన్ని అందించడం ద్వారా గుప్తా ఫౌండేషన్ తన ప్రాధాన్యతను మరింత పెంచుకుందని వ్యాఖ్యానించారు. పురస్కార గ్రహీత ద్వానా శాస్ర్తీ మాట్లాడుతూ తాను ఏలూరుకు చెందినవాడినేనని, ఇక్కడి సిఆర్‌ఆర్‌లో విద్యాభ్యాసం చేశానని పేర్కొన్నారు. తనను గౌరవించిన గుప్తా ఫౌండేషన్ అధినేత మడుపల్లి మోహన్‌గుప్తాకు కృతజ్ఞతలు తెలిపారు.
ఏలూరులో సోమవారం ద్వానా శాస్ర్తీకి కృష్ణమూర్తి సాహిత్య పురస్కారాన్ని
అందజేస్తున్న గుప్తా ఫౌండేషన్ సభ్యులు