ఆంధ్రప్రదేశ్‌

గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఈడ్పుగంటి కన్నుమూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 1: టిడిపి సీనియర్ నాయకుడు, కృష్ణా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఈడ్పుగంటి వెంకట్రామయ్య(53) మంగళవారం గుండెపోటుతో మృతి చెందారు. మైలవరం నియోజకవర్గానికి పార్టీ ఇన్‌చార్జి హోదాలో మంగళవారం నగరంలోని గొల్లపూడిలో జరిగిన జనచైతన్య యాత్రలో మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఉదయం నుంచి ఉత్సాహంగా తిరిగిన ఆయన మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఆకస్మికంగా గుండెపోటుతో కుప్పకూలిపోయారు. మంత్రి ఉమ, ఇతర నాయకులు వెంటనే సమీపంలోని ఆంధ్రా ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు. జనచైతన్య యాత్ర ప్రారంభంలోనే సీనియర్ నాయకుడు మృతి చెందటంపై పార్టీ నాయకుల్లో విషాదం నెలకొంది. వెంకట్రామయ్య మరణంపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి చెందారు.