ఆంధ్రప్రదేశ్‌

వ్యవసాయ పరిరక్షణ జోన్‌పై తొలగని ప్రతిష్టంభన!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 28: రాజధాని నిర్మాణం సమయంలో వ్యవసాయ భూమికి రక్షణ కల్పిస్తూ సింగపూర్ ఇచ్చిన క్యాపిటల్ రీజియన్ ప్రణాళికలో కొన్ని ప్రాంతాలను ఇయర్ మార్క్ చేసింది. అగ్రికల్చర్ ప్రొటక్షన్ జోన్-1, 2, 3గా దీన్ని పేర్కొంది. ఈ జోన్ల ఏర్పాటును స్థానిక రైతులతో పాటు అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపిలు కూడా వ్యతిరేకించారు. వ్యవసాయ భూముల పరిరక్షణ అవసరాలను సిఆర్‌డిఎ అధికారులు ప్రజాప్రతినిధులకు వివరించినా, వారు సంతృప్తి చెందలేదు. ఏకంగా ఈ నిర్ణయాన్ని రద్దుచేయాలంటూ వారు డిమాండ్ చేస్తూ వస్తున్నారు. మరోపక్క వ్యవసాయ భూముల పరిరక్షణకు సంబంధించి ఆయా ప్రాంత ప్రజల నుంచి అభ్యంతరాలను సిఆర్‌డిఏ కోరింది. ఈ అభ్యంతరాలు తెలియచేసే గడువు ఈ నెల 15వ తేదీతో ముగిసినా ఇంతవరకూ దీనిపై ప్రతిష్ఠంభన తొలగలేదు. సిఆర్‌డిఏ మళ్లీ గడువు పెంచుతుందా? వచ్చిన అభ్యంతరాలను పరిశీలిస్తుందా? అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు వ్యతిరేకిస్తూ ప్రణాళిక ప్రకారం ముందుకు వెళుతుందా? అనేది తేలాల్సి ఉంది. క్యాపిటల్ రీజియన్‌కి సంబంధించి సింగపూర్ ఇచ్చిన ప్రణాళికలో గుంటూరు, కృష్ణా జిల్లాల్లో 8,296 ఎకరాల భూమిని వ్యవసాయ పరిరక్షణ జోన్‌గా నిర్ణయించింది. ఈ భూమి అంతా కృష్ణాడెల్టా పరిధిలోకి వస్తోంది. ఈ రెండు జిల్లాల్లోని పలు మండలాల్లో అనేక గ్రామాలు ఈ పరిధిలోకి వస్తున్నాయి. ఈ ప్రణాళిక ప్రకారం ఆయా భూములను కేవలం వ్యవసాయం, లేదా వ్యవసాయాధారిత పరిశ్రమలకు మాత్రమే వినియోగించాల్సి ఉం టుంది. వ్యవసాయ భూముల్లో ఇతరత్రా నిర్మాణాలు చేపట్టడానికి వీల్లేదు. ఇందుకు భూమిని బదలాయించరు. గతంలో ఈ భూముల ధరలు ఎలా ఉన్నా, రాజధాని వచ్చిన తరువాత ఉన్నపళంగా పెరిగిపోయాయి. దీంతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఈ భూములను కోట్ల రూపాయలిచ్చి కొనుగోలు చేయడానికి ముందుకొస్తున్నారు.