ఆంధ్రప్రదేశ్‌

అంతర్జాతీయ విద్యాకేంద్రంగా అమరావతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 1: ‘విద్యతో ప్రగతి ప్రయాణం చేస్తుంది. విజయాలన్నీ విద్య వెంటే ఉంటాయి. ఈ సత్యాన్ని గుర్తించినందునే నవ్యాంధ్ర రాజధాని అమరావతిని అంతర్జాతీయ విద్యా నగరంగా తీర్చిదిద్దుతాం. రాష్ట్రంలో ప్రగతిబాటలు వేసేందుకు అనువైన బృహత్ ప్రణాళిక సిద్ధం చేశాం. సువిశాల 430 ఎకరాల విస్తీర్ణంలో అంతర్జాతీయంగా పేరుప్రఖ్యాతులు పొందిన విద్యాసంస్థల స్థాపన ద్వారా అమరావతిని విద్యాకేంద్రంగా (హబ్) చేయాలన్న కార్యాచరణను రూపొందించాం. అమరావతిని విజ్ఞానఖనిగా రూపుదిద్దుతాం’.. అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. అమరావతిని అంతర్జాతీయ విద్యా హబ్‌గా తీర్చిదిద్దడంలో భాగంగా తొలిగా 100 ఎకరాల్లో ప్రఖ్యాత వెల్లూరు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (విట్)కు ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణం, పట్టణ పేదరిక నిర్మూలన శాఖ మంత్రి ఎం వెంకయ్యనాయుడు గురువారం శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లపై సిఆర్‌డిఏ ఉన్నతాధికారులతో మంగళవారం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. మున్సిపల్ పరిపాలనా శాఖ మంత్రి పి నారాయణ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పి టక్కర్, సిఎం ముఖ్య కార్యదర్శి సతీష్‌చంద్ర, ఇంధన, వౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, సిఆర్‌డిఎ శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్, సిఆర్‌డిఏ కమిషనర్ చెరుకూరి శ్రీ్ధర్, తదితరులు పాల్గొన్నారు. తమ పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దే నాణ్యతా ప్రమాణాలతో కూడిన విద్యాసంస్థలు అందుబాటులో ఉన్నాయనే విశ్వాసం కలిగాకే పలువురు పారిశ్రామికవేత్తలు హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చారని సిఎం గుర్తుచేశారు. చంద్రబాబు నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్ వివరాలను ఇంధన, వౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, సిఆర్‌డిఎ శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్ విలేఖర్లకు వెల్లడించారు. నవ్యాంధ్రలో కొద్దికాలంలోనే విట్, ఇండో-యుకె ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (ఎన్‌ఐడి), ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైనె్సస్ (ఎఐఐఎంఎస్), సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ (సిఐటిడి), ఆంధ్రప్రదేశ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్ (ఏపిహెచ్‌ఆర్‌డిఐ) వంటి ప్రపంచశ్రేణి సంస్థలు కార్యకలాపాలను చేపట్టేందుకు ముందుకు రావడం పట్ల సిఎం హర్షం వ్యక్తం చేసినట్లు వివరించారు.
సచివాలయంలో డిస్పెన్సరీ ప్రారంభం
గుంటూరు: రాజధానిలో అఖిల భారత వైద్య శాస్త్రాల సంస్థ (ఎయిమ్స్) ఏర్పాటుపై వైద్య విద్య, ఆరోగ్య శాఖ మంత్రి డా. కామినేని శ్రీనివాస్ మంగళవారం సచివాలయంలో సమీక్ష జరిపారు. గుంటూరు కలెక్టర్ కాంతిలాల్ దండే, ఆర్డీవో, జిల్లా అటవీ అధికారి, మంగళగిరి ఏపిఎస్పీ బెటాలియన్ పోలీసు ఉన్నతాధికారులు సమావేశానికి హాజరయ్యారు. మరో 15రోజుల తరువాత ఎయిమ్స్‌కు కేటాయించిన స్థలంలో సమావేశం కానున్నట్లు మంత్రి తెలిపారు. అనంతరం హెచ్‌ఒడిలతో జరిగిన సమావేశంలో త్వరలో ముఖ్యమంత్రిచే ప్రారంభించనున్న 35సంవత్సరాలు నిండిన మహిళలకు ఉచిత వైద్యపరీక్షలపై మంత్రి చర్చించారు. సచివాలయం మూడవ బ్లాక్‌లో డిస్పెన్సరీని ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మురళీకృష్ణతో కలిసి ఆయన ప్రారంభించారు.