ఆంధ్రప్రదేశ్‌

మళ్లీ మావోయిస్టుల కలకలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, సీలేరు, నవంబర్ 1: బెజ్జంగి ఎన్‌కౌంటర్‌లో ఏఓబిలో మావోయిస్ట్‌లు తుడిచిపెట్టుకుపోయారనుకున్నారు. ఏఓబిలో మావోయిస్ట్‌ల ఉనికే లేదంటూ పోలీసులు అభిప్రాయపడుతున్న సమయంలో ఒక్కసారిగా సుమారు 30 మంది సాయుధ మావోయిస్ట్‌లు సోమవారం అర్థరాత్రి దాటిన తరువాత దారకొండ, సప్పర్ల గ్రామాలకు రావడం గమనార్హం. విశాఖ ఏజెన్సీలో గ్రేహౌండ్స్ బలగాలు మావోయిస్ట్‌ల కోసం జల్లెడ పడుతున్నాయి.
అయినప్పటికీ వారి కళ్లు కప్పి సాయుధ మావోయిస్ట్‌లు దారకొండ, సప్పర్లలో సంచరించడంతో పరిస్థితులు ఎప్పుడు ఏవిధంగా ఉంటుందోనన్న భయానక వాతావరణం నెలకొంది. దారకొండ, సప్పర్ల ప్రాంతానికి వచ్చిన మావోయిస్ట్‌లు కరపత్రాలను గ్రామల్లో వెదచల్లారు. బ్యానర్లు కూడా కట్టారు. 24 మంది మావోయిస్ట్‌లు పోలీసులు అతి కిరాతకంగా హతమార్చారని అందుకు నిరసనగా ఈనెల మూడో తేదీన ఐదు రాష్ట్రాల బంద్‌కు పిలుపునిచ్చామని ఆ కరపత్రాల్లో పేర్కొన్నారు. సిద్ధాంతపరమైన మావోయిస్ట్ ఉద్యమం ఎప్పటికీ ఆగదని అందులో పేర్కొన్నారు. 30 మంది మావోయిస్ట్‌లను ఏక కాలంలో బూటకపు ఎన్‌కౌంటర్ చేశారని అన్నారు. ఒక కామ్రేడ్ చనిపోతే, వేలాది మంది కామ్రేడ్‌లు పుట్టుకొస్తారని బ్యానర్లపై రాశారు. బంద్‌ను విజయవంతం చేయాలని ఈస్ట్ డివిజన్ కమిటీ పేరుతో విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉండగా బంద్ సందర్భంగా ఏఓబిలో మావోయిస్ట్‌లు భారీ విధ్వంసానికి పాల్పడవచ్చన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులు, అధికారులను లక్ష్యంగా చేసుకుని మావోయిస్ట్‌లు విధ్వంసానికి పాల్పడవచ్చని భావిస్తున్నారు. ఏజెన్సీలోని వివిధ ప్రాంతాల్లో కాంట్రాక్ట్ పనుల కోసం వినియోగిస్తున్న యంత్రాలను సమీప పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీస్ స్టేషన్ల వద్ద భారీ బందోబస్త్ ఏర్పాటు చేస్తున్నారు. 24న జరిగిన ఎన్‌కౌంటర్‌కు ధీటుగా జవాబు ఇచ్చి ఉనికి చాటుకోడానికి మావోయిస్ట్‌లు ఎంతకైనా తెగిస్తారన్న భయాందోళనలతో గిరిజనులు వణికిపోతున్నారు. ఏఓబిలో ఇప్పటికీ అనేక ప్రాంతాల్లో దుకాణాలు తెరవడానికి కూడా వ్యాపారులు భయపడుతున్నారు. గతంలో మావోయిస్ట్‌లు జన్‌కో గెస్ట్ హౌస్, జలవిద్యుత్ కేంద్రం, పోలీస్ స్టేషన్‌పై దాడికి దిగిన సంగతి తెలిసిందే. అటువంటి పరిస్థితులు పునరావృతం కాకుండా భద్రతా బలగాలు రేయింబవళ్లు పహారా కాస్తున్నాయి.

ఆర్కే మృతదేహమంటూ
మన్యంలో వదంతులు
ఇదిలా ఉండగా బలిమెల రిజర్వాయర్‌లో మంగళవారం ఒక వ్యక్తి మృతదేహం తేలింది. ఇది ఆర్కే మృతదేహమంటూ పుకార్లు లేవనెత్తడంతో జనం అంతా అక్కడికి చేరుకున్నారు. పోలీసులు కూడా అక్కడికి వచ్చి అది ఆర్కే మృతదేహం కాదని తేల్చి చెప్పారు.

13 మంది గిరిజనుల
అదృశ్యంపై సస్పెన్స్
ఇక గత వారం రోజులుగా కనిపించకుండాపోయిన 13 మంది గిరిజనుల జాడ మంగళవారం కూడా తెలియరాలేదు. సాధారణంగా సంతలకు వెళ్లిన గిరిజనులు రెండు, మూడు రోజుల తరువాత ఇళ్ళకు తిరిగి వస్తుంటారు. వారానికి పైగా వీరి ఆచూకీ కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. 24న జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించిన వారి ఫొటోలను పోలీసులు విడుదల చేశారు. వాటిలో కొన్నింటినే ప్రజా సంఘాల నాయకులు వరవరరావు తదితరులు గుర్తించారు. మిగిలిన వాటిని గుర్తించలేకపోయారు. ఆచూకీ తెలియకుండా పోయిన గిరిజనుల మృతదేహాలా? అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. పోలీసులను ఆశ్రయిస్తే ఫలితమేమైనా ఉంటుందా? ఖననం చేసిన మృతదేహాలను తిరిగి బయటకు తీసి చూస్తే ఆచూకీ లభ్యమవుతుందా? ఈ కుటుంబాలకు సహకరించడానికి ఇప్పటి వరకూ ఏ ప్రజా సంఘాల0 ప్రతినిధులు జోక్యం చేసుకోపోవడం గమనార్హం.