ఆంధ్రప్రదేశ్‌

అసైన్డ్ భూములపై వచ్చే కేబినెట్‌లో నిర్ణయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, నవంబర్ 1: అసైన్డ్ భూముల (డాట్ లాండ్స్) విషయమై వచ్చే కేబినెట్‌లో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని ఉప ముఖ్యమంత్రి కెఇ కృష్ణమూర్తి వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సలహాలు, సూచనలపై రెవెన్యూ శాఖలో ఎన్నో సంస్కరణలను అమలుచేస్తున్నట్లు చెప్పారు. మంగళవారం సచివాలయంలో భూవివాదాలు - పరిష్కారాలపై సిసిఎల్‌ఎ అనిల్ పునీతచంద్ర, రెవెన్యూ ముఖ్య కార్యదర్శి జెసి శర్మ, ఐటి, రెవెన్యూ ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం విలేఖర్లతో మాట్లాడుతూ భూ సమీకరణ, సేకరణ వల్ల తలెత్తే సమస్యలను పరిష్కరించేందుకు ఆర్డీవోలకు ప్రత్యేక అధికారాలు కల్పిస్తామన్నారు. డెప్యూటీ కలెక్టర్ల నేతృత్వంలో భూ లోక్‌అదాలత్‌లను ప్రజా సాధికార సర్వే ముగిసిన వెంటనే చేపడతామని చెప్పారు. రాష్టవ్య్రాప్తంగా అన్ని మండలాల్లో అదాలత్‌ల ద్వారా భూవివాదాలను పరిష్కరిస్తామన్నారు. రాష్ట్రంలోని భూముల వివరాలన్నింటినీ క్రోడీకరించి ల్యాండ్ హబ్ ఏర్పాటు చేస్తున్నామని, ప్రత్యేకంగా నియమించే ల్యాండ్ అథారిటీ దీన్ని పర్యవేక్షిస్తుందని వివరించారు. ఈ నెల 10 నుంచి అన్ని రెవెన్యూ కార్యాలయాల్లో ఇ-ఆఫీస్ అమలు చేస్తామన్నారు. మీ సేవ ద్వారా వచ్చే దరఖాస్తులను ఫస్ట్ ఈజ్ ఫస్ట్ అవుట్ పద్దతిలో పరిష్కరించేందుకు ఆదేశాలు జారీ చేశామన్నారు. డిఎల్‌ఆర్‌ఎంపి కింద రాష్టవ్య్రాప్తంగా 49లక్షల ఎఫ్‌ఎంబి (్ఫల్డ్ మెజర్‌మెంట్ బుక్)లను డిజిటలైజ్ చేస్తున్నామని వివరించారు. ఇకపై జరిగే వీఆర్వోల నియామకాలకు సంబంధించి అభ్యర్థులకు కంప్యూటర్ పరిజ్ఞానంతో పాటు సర్వేపై అవగాహన కలిగి ఉండాలనే నిబంధన విధిస్తామన్నారు.