ఆంధ్రప్రదేశ్‌

ప్రయోగాత్మకంగా ఎరువుల అమ్మకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 1: క్షేత్రస్థాయిలో ఎరువుల వినియోగంపై జిల్లాలో అమలు చేస్తున్న ఎరువుల నిర్వహణ విధానాన్ని పరిశీలించేందుకు కేంద్ర బృందం పర్యటించేందుకు ఇదే అనుకూల సమయమని కలెక్టర్ బాబు.ఎ అన్నారు. న్యూ ఢిల్లీ నుండి కేంద్ర ప్రభుత్వ సాంకేతిక బృందంతో మంగళవారం స్కైప్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ బాబు.ఎ మాట్లాడుతూ కృష్ణా జిల్లాలో ఆధార్ అనేబుల్ ఫెర్టిలైజర్ డిస్ట్రిబ్యూషన్ విధానంలో లక్ష మెట్రిక్ టన్నుల ఎరువులను సరఫరా చేశామని తెలిపారు. ఆధార్ సంఖ్య, ల్యాండ్ డేటా, భూసార పరిరక్షణ నేపథ్యంలో ఎరువుల వినియోగాన్ని క్రమబద్ధీకరించడం ద్వారా రైతులకు లాభసాటితో కూడిన ఎరువుల వినియోగాన్ని అమలు చేయడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా 16 జిల్లాల్లో ఎఇఎఫ్‌ఎంఎస్ విధానం అమలు చేయడంపై కేంద్రం చొరవ చూపుతోందన్నారు. ఈ దశలోనే పైలెట్ ప్రాజెక్టుగా కృష్ణా జిల్లాలో జరుగుతున్న పనులపై రైతులకు అవగాహన ఏర్పడిందన్నారు. ఏ రైతు ఎంతమేర ఎరువులు తీసుకెళ్లారో వంటి అంశాలపై కూడా దృష్టి సారించామన్నారు. భూసార పరీక్ష ద్వారా ఎరువుల వినియోగంపై రైతులు అవగాహన పొందగలుగుతున్నారన్నారు. జాతీయస్థాయిలో అందుబాటులో ఉన్న సాయిల్ హెల్త్ విధానాన్ని క్షేత్రస్థాయిలో జిల్లాల డేటాతో అనుసంధానించాల్సి ఉందన్నారు. జిల్లాలో ఖరీఫ్ సీజన్ నాట్లు పూర్తయ్యాయని, ఈ సమయంలో కేంద్ర బృందం పర్యటించడం ద్వారా క్షేత్రస్థాయిలో అవగాహన పెంచుకోగలుగుతారన్నారు. ఇప్పటికే జిల్లాలో ఎదుర్కొంటున్న పలు సాంకేతికపరమైన అంశాలతో కూడిన నివేదికను కేంద్ర సాంకేతిక బృందానికి పంపామన్నారు. జాతీయస్థాయి అధ్యయన కమిటీ బృంద ప్రతినిధులు పవన్ భక్షి, విక్రమ్, అనురోధ్‌గిరి న్యూఢిల్లీ నుంచి ఈ సమావేశంలో పాలుపంచుకున్నారు.

సెంట్రల్ టీమ్‌తో మాట్లాడుతున్న కృష్ణా జిల్లా కలెక్టర్ బాబు