ఆంధ్రప్రదేశ్‌

ఆక్వాపై రాజకీయ కల్లోలం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 2: ఏ క్షణాన రాష్ట్ర విభజన జరిగిందో నాటి నుంచి అనుక్షణం వర్గ, ప్రాంత, కుల మతాల మధ్య ఏదో చిచ్చు రేగుతూనే వుంది. తొలుత రాజధానికి సంబంధించి భూసమీకరణ, ఆపై స్విస్ చాలెంజ్, కాలుష్యం.. వంటి అంశాలపై వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇక కాపు, బిసి రిజర్వేషన్ వివాదం ఆ వర్గాల మధ్య రగులుతోంది. బందరు ఓడరేవు భూసేకరణపై వివాదం తారాస్థాయికి చేరుకుంటోంది. ఇదిలావుంటే రాష్ట్ర ప్రభుత్వం ఆక్వా పరిశ్రమ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి కల్పనతోపాటు రాబడి కూడా సాధించాలనే పట్టుదలతో ఆక్వా ఫుడ్‌పార్క్‌ల ఏర్పాటును అన్ని విధాలుగా ప్రోత్సహిస్తోంది. ఈ పరిశ్రమలో పర్యావరణ అనుమతులు తప్పనిసరి. కానీ, ప్రజాభిప్రాయ సేకరణ మాత్రం అవసరం లేదని ఓ వైపు కాలుష్య నియంత్రణ బోర్డు చెబుతోంది. కానీ కాలుష్యం స్థాయి ఎక్కువగా ఉంటుందంటూ ఆందోళనలు తీవ్రస్థాయిలో జరుగుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో సిపిఐ నేతృత్వంలో వివిధ పార్టీలు, ప్రజాసంఘాలు, ఆక్వా రైతులు పెద్ద ఎత్తున ఇటీవలి కాలంలో ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఉద్యమించిన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టు పార్టీల నేతలపై లాఠీలు విరగటం, అరెస్టులు చేయటంతో ఆందోళనలు మరింత ఉద్ధృతమయ్యాయి. ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ కూడా ఈ అంశాన్ని అందిపుచ్చుకుంది. ప్రభుత్వం మాత్రం పరిశ్రమల ఏర్పాటు ప్రతిపాదనలను ప్రతిపక్షాలు గుడ్డిగా వ్యతిరేకిస్తున్నాయని వాదిస్తోంది.
ప్రమాదకరమైన సిమెంట్ ఫ్యాక్టరీల స్థాపనపై నోరు మెదపని రాజకీయ పక్షాలు ప్రస్తుతం ఆక్వా పరిశ్రమల పైనే విమర్శలు ఎక్కుపెట్టడం ఏమిటని ప్రశ్నిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం ప్రస్తుతానికి రాష్ట్రంలో 69 ఆక్వా ప్రాసెసింగ్ ప్లాంట్లు ఉన్నాయి. అత్యధికంగా ప.గో జిల్లాలో 17, విశాఖలో 16, నెల్లూరులో 11, తూ.గోలో 10, ప్రకాశంలో 9, కృష్ణాలో ఆరు ప్లాంట్లు ఉన్నాయి. ఇప్పటివరకు ఆక్వా పరిశ్రమ వల్ల విదేశీ మారకద్రవ్యంతో పాటు దేశంలోనే ఎపి ఆక్వా ఎగుమతుల్లో నంబర్ వన్ స్థానంలో ఉంది. దేశవ్యాప్తంగా చేసే ఎగుమతుల్లో ఒక్క ఎపి నుంచే 70 శాతం ఎగుమతి జరుగుతోంది. పైగా రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో ఆక్వా పరిశ్రమ వాటా 4.74 శాతంగా ఉంది. అంతేకాకుండా మెగా ఫుడ్ పార్క్ ఏర్పాటుతో 3 వేల మందికి ప్రత్యక్షంగా, మరో 3వేల మందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. 2015-16లో 23.52 లక్షల టన్నుల మత్స్య ఉత్పత్తులను సాధించారు. దీని విలువ రూ.31 వేల కోట్లు. ఇక 2016-17లో రూ.40 వేల కోట్ల విలువైన మత్స్య ఉత్పత్తుల ఎగుమతికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఏడాది పొడవునా రొయ్యలు, చేపల మార్కెట్‌కు డిమాండ్ ఉంది. అందువల్ల ఆక్వా పరిశ్రమ వల్ల నష్టం లేదని, అందుకు సహకరించాలని ప్రభుత్వం కోరుతోంది. ఆక్వా ఉత్పత్తుల ప్రాసెసింగ్‌కు అనుబంధంగా నిర్మించే కోల్డ్ స్టోరేజీల నుంచి ప్రమాదకరమైన అమ్మోనియా గ్యాస్ వస్తుందనేది విపక్షాలు, పంటపొలాల రైతుల ప్రధాన ఆరోపణ. అయితే ఈ గ్యాస్ లీక్ కాకుండా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి స్వయంగా హామీ ఇస్తున్నారు. అయినా రైతుల్లో ఆందోళన తగ్గటం లేదు. దీనివల్ల తమ వ్యవసాయం దారుణంగా దెబ్బ తింటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితిలోనూ ఆక్వా పరిశ్రమను రాకుండా అడ్డుకుంటామని రైతులు భీష్మించుకున్నారు. విపక్షాలకు ఇది మంచి అస్త్రంగా మారింది. ఇక దీనికి సామరస్య పరిష్కారాన్ని ప్రభుత్వం ఏ విధంగా చూపుతుందనేది ప్రశ్న.