ఆంధ్రప్రదేశ్‌

ఎవరెస్ట్ ఎక్కిస్తాం.. రండి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 2: ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించాలనుకునే విద్యార్థులకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది ప్రభుత్వం. వౌంట్ ఎవరెస్ట్ పర్వతారోహణకు సంబంధించిన ప్రకటనను యువజన సర్వీసుల శాఖ బుధవారం విడుదల చేసింది. ‘మిషన్ ఎవరెస్ట్ ఎపి యూత్ ఆన్ టాప్ ఆఫ్ ద వరల్డ్’ పేరుతో ఈ ఏడాది కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. హిమాలయ పర్వత శ్రేణుల్లో సముద్ర మట్టానికి 8848 మీటర్ల ఎత్తులో ఎవరెస్ట్ ఉంది. అలాంటి పర్వత శ్రేణి ఎక్కడం ద్వారా యువతలో సాహసవంతమైన ఆలోచనలు రేకెత్తించాలని ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపడుతోంది. నిరుపేదలను పర్వతారోహణ చేయించడం ద్వారా ఆయా వర్గాల్లో సరికొత్త ఆలోచనలు రేకెత్తించాలనేది సర్కారు యోచన. గ్రామీణ ప్రాంతాల యువతను పర్వతారోహణ వైపు ఆసక్తి చూపేలా అవకాశాలు కల్పించడమే ఈ ప్రాజెక్టు లక్ష్యం. ఈ ప్రాజెక్టు ద్వారా వౌంట్ ఎవరెస్ట్ ఎక్కేందుకు ఐదుగురికే అవకాశం కల్పిస్తున్నప్పటికీ 7 దశల్లో 20 మందికి పూర్తిస్థాయి శిక్షణ అందిస్తారు. వారందరికీ పర్వతారోహణపై సమగ్ర అవగాహన కల్పిస్తారు. ఈ పథకం కింద ఎస్సీ, ఎస్టీలు, మహిళల నుంచి ఒక్కొక్కరిని, ఓపెన్ కేటగిరి నుంచి మరో ఇద్దరిని ఎంపిక చేస్తారు. రాష్ట్రంలోని అనాథలు, నిరుపేదలకు ఎంపిక ప్రక్రియలో ప్రాధాన్యత ఉంటుంది. రాష్ట్రానికి చెంది 18-29 మధ్య వయసున్న యువతీ యువకులు దరఖాస్తు చేసుకోవచ్చు. గ్రామీణ ప్రాంతాల కుటుంబాల నుంచి వచ్చినవారికి ఆదాయ పరిమితి రూ.81వేలు కాగా, పట్టణ ప్రాంతాల నుంచి వచ్చేవారికి లక్షా 3 వేలు ఉండాలి. తెల్ల రేషన్ కార్డు ఆదాయ పరిమితికి సాక్ష్యంగా పరిగణిస్తారు. చదువు, ఎత్తు, కొలతలతో ఎంపిక ప్రక్రియ ఉండదు. హిందీ, ఇంగ్లీషు భాషల్లో ప్రావీణ్యత అదనపు అర్హత. ప్రభుత్వ వైద్యుడు పరిశీలించిన మీదట దరఖాస్తును పరిశీలిస్తారు. అభ్యర్థులకు తల్లిదండ్రుల ఆమోదమూ తప్పనిసరి.
పురుషులు వంద మీటర్ల పరుగు పందాన్ని 16 సెకన్లలో, 2.4 కి.మీలు 10 నిమిషాల్లో పూర్తిచేయాలి. ఇక మహిళలు వంద మీటర్ల పరుగు పందాన్ని 18 సెకన్లలో, 2.4 కి.మీలను 13 నిముషాల్లో పూర్తిచేయాల్సి ఉంటుంది. పురుషులు 3.65 మీటర్ల లాంగ్‌జంప్‌ను మూడు ఛాన్స్‌లలో, ఇక మహిళలు 2.7 మీటర్ల లాంగ్‌జంప్‌ను 3 ఛాన్స్‌లో పూర్తిచేయాల్సి ఉంటుంది. ఫేజ్-3 కింద ఎంపిక చేసిన 20 మంది అభ్యర్థులకు రక్షణ శాఖ ఆమోదించిన పర్వతారోహణ సంస్థలో శిక్షణ ఇస్తారు. వారిలో మెరికల్లాంటి 9 మందిని ఎంపిక చేసి తర్వాతి దశల్లో శిక్షణ అందిస్తారు. ఫేజ్-4 కింద వౌంట్ ఎవరెస్ట్ ఎక్కే సమయంలో ఎలా వ్యవహరించాలి, ఏవిధంగా పర్వతారోహణ చేయాలి, ఎలాంటి భద్రతా చర్యలు తీసుకోవాలనే దానిపై సలహాలు, సూచనలు అందిస్తారు. నెలరోజుల పాటు శిక్షణ కొనసాగుతుందని యువజన సర్వీసుల శాఖ ప్రకటనలో వివరించారు.