రాష్ట్రీయం

ఏపిలో కుస్తీ.. తెలంగాణలో దోస్తీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, నవంబర్ 2: ఇంతకూ తెలుగుదేశం పార్టీకి సిపిఎం మిత్రపక్షమా? శత్రుపక్షమా? జాతీయ పార్టీగా మారిన తర్వాత రాష్ట్రానికో విధంగా అనుసరిస్తున్న విధానాలతో తెదేపా నేతల్లో కనిపిస్తోన్న గందరగోళమిది. ఆంధ్రప్రదేశ్‌లో తమ ప్రభుత్వంపై పోరాటం చేస్తూ, వైకాపాతో కలిసి అడుగులు వేస్తున్న సిపిఎంతో తెలంగాణ తెదేపా నేతలు చెట్టపట్టాలేసుకుని తిరుగుతుండటం ఏపి తమ్ముళ్లకు మింగుడుపడకుండా ఉంది. తెలంగాణ ముఖ్యమంత్రి, టిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్ర సిపిఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. ఈ పాదయాత్రను వ్యతిరేకిస్తూ సిపిఎంపై తెరాస అనుకూల మీడియాలో అనేక కథనాలు కూడా వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో తమ్మినేని పాదయాత్రకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి సంఘీభావం ప్రకటించడం పార్టీ ఏపి నేతలకు రుచించడం లేదు. ఆ సందర్భంగా కెసిఆర్‌ను ఉద్దేశించి రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇక్కడ తమకూ వర్తించేలా ఉన్నాయని ఇబ్బందిపడుతున్నారు. సిపిఎం నేత తమ్మినేనిని అణచివేసే పద్ధతిని కెసిఆర్ మానుకోవాలని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. అయితే, ఏపి లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై సిపిఎం తీవ్ర స్థాయిలో పోరాటం కొనసాగిస్తోంది. ఈ విషయంలో ఆ పార్టీ తెదేపా రాజకీయ ప్రత్యర్థి వైకాపాతో కలిసి ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇటీవల పశ్చిమ గోదావరి జిల్లాలో ఆక్వా పార్కు బాధితుల పక్షాన పోరాడిన సిపిఎం ఏపి కార్యదర్శి పెనుమల్లి మధును ప్రభుత్వం అరెస్టు చేయడం, దాన్ని వైకాపా అధినేత జగన్ ఖండించటంతో పాటు ఫోన్‌లో పరామర్శించి, సిపిఎంఉద్యమానికి మద్దతు ప్రకటించడాన్ని ఏపి తమ్ముళ్లు గుర్తుచేస్తున్నారు. ఏపిలో తమ పార్టీని లక్ష్యంగా చేసుకుని ఉద్యమాలను తీవ్రతరం చేస్తున్న సిపిఎంను తెలంగాణలో తమ నేతలు సమర్థించడం రాజకీయంగా ఎలాంటి సంకేతాలిస్తాయని వారు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో కలిసి నిర్వహించిన కార్యక్రమాలతో అప్రతిష్ఠ ఏర్పడిందని గుర్తు చేస్తున్నారు. రాష్ట్రానికో విధంగా విధానాలు మార్చుకుంటే పార్టీ నేతలతో పాటు ప్రజల్లోనూ గందరగోళం నెలకొంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పైగా రానున్న ఎన్నికల్లో ఏపిలో సిపిఎం, వైకాపా కలిసి పోటీచేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ఏపి తెదేపా నేతలు విశే్లషిస్తున్నారు. అలాంటి పార్టీకి పక్క రాష్ట్రంలో మద్దతిస్తే ఎలాంటి సంకేతాలు వెళతాయని ప్రశ్నిస్తున్నారు. ‘ఇక్కడ మమ్మల్ని వ్యతిరేకిస్తూ జగన్‌తో కలిసి పనిచేస్తున్న ఇదే సిపిఎంకి తెలంగాణలో ఎలా మద్దతిస్తారో మాకూ అర్థంకావడం లేదు. మొన్నీమధ్య జరిగిన సమన్వయ కమిటీ సమావేశంలో కూడా ఈవిషయం ఎక్కడా ప్రస్తావనకు రాలేదు. ఈ నిర్ణయం ఎవరు తీసుకున్నారో, ఏ స్థాయిలో జరిగిందో తెలియదు. విధానపరమైన ఇలాంటి నిర్ణయాలు భవిష్యత్తులో పార్టీకి నష్టం కలిగిస్తాయి. మీరు తెలంగాణలో సిపిఎంను సమర్థిస్తూ, ఏపిలో ఎలా వ్యతిరేకిస్తారని తెరాస వాళ్లడిగితే ఏం సమాధానం చెబుతాం? ఇప్పటికే మేం తెలంగాణలో కాంగ్రెస్‌తో కలిసి పనిచేస్తున్నామనే విమర్శ ఉంది. మాకు అక్కడ ఇప్పుడు అధికారం లేకపోవచ్చు. కానీ కొనే్నళ్లు ఉమ్మడి రాష్ట్రాన్ని పాలించిన పార్టీగా మాకూ ఒక స్థాయి ఉంది. దాన్ని కాపాడుకోవాలి కదా’ అని ఏపీకి చెందిన ఓ సీనియర్ నేత వ్యాఖ్యానించారు.