ఆంధ్రప్రదేశ్‌

కల్తీ కారం మిల్లులపై విజిలెన్స్ దాడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, నవంబర్ 3: కారం.. కారంగా ఉంటే చాలు. అందులో మమకారం మిక్స్ చేయాల్సిన అవసరం లేదంటూ కారం మిల్లులు అక్రమాలకు తెగబడ్డాయి. మొన్నటివరకు తాలుగాయలు, పిచ్చికాయలు దంచి ఆకర్షణీయమైన ప్యాకెట్లలో వినియోగదారుడికి అంటగట్టే విధానానికి తెరదించి నాణ్యమైన మిరపకాయలు, గింజల నుండి నూనె, రంగును వేరుచేయగా మిలిగిన పిప్పి, తొడిమలను పొడిచేసి, అందులో రంగులు రంగరించి ఏకంగా వినియోగదారుల కళ్లల్లో కారం కొడుతున్నారు. ఫిర్యాదులందిన నేపథ్యంలో కనె్నర్ర చేసిన విజిలెన్స్ అధికారులు కొరడా ఝుళిపించారు. గుంటూరు మిర్చియార్డు చుట్టుపక్కల ఉన్న పలు కారం మిల్లులపై గురువారం విజిలెన్స్ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. దాడుల్లో సుమారు 2.08 కోట్ల రూపాయల విలువైన 260 టన్నుల కల్తీకారాన్ని సీజ్ చేశారు. మిర్చియార్డు సమీపంలో ఉన్న భువనేశ్వరీ ఇండస్ట్రీ, లక్ష్మీ గణపతి ఇండస్ట్రీ కంపెనీలపై విజిలెన్స్ దాడులు జరిగాయి. భువనేశ్వరీ ఇండస్ట్రీ యజమాని అంబటి కాశయ్య తొడిమలు, తాలుగాయలు, రంగు కలిపి కారంగా తయారుచేసి విక్రయిస్తున్నాడు. కంపెనీలో 200 బస్తాల కల్తీ కారంతో పాటు 9 బస్తాల కృత్రిమ రంగులను స్వాధీనం చేసుకున్నారు. లక్ష్మీగణపతికి చెందిన 400 బస్తాల కల్తీకారాన్ని ఏటుకూరు రోడ్డులోని ఓ కోల్డ్‌స్టోరేజీలో అనధికారికంగా నిల్వచేశారు. సమాచారం తెలుసుకున్న అధికారులు సుమారు రూ.40లక్షల రూపాయల విలువైన సరుకును సీజ్ చేశారు. అక్కడే ఉన్న ఉదయ్ కోల్డ్‌స్టోరేజ్‌లో తనిఖీలు నిర్వహించగా 4,200 బస్తాల కారం పిప్పిని కనుగొని సరుకును సీజ్ చేశారు. ఖమ్మంలో ఓ ఫ్యాక్టరీలో మిరప కాయల నుంచి రంగు, ఆయిల్‌ను వేరుచేసిన తరువాత మిగిలే పిప్పిని కొనుగోలు చేసి కల్తీకారం తయారుచేసేందుకు నిల్వచేశారు. దీని విలువ కోటీ 60లక్షల రూపాయల వరకు ఉంటుందని విజిలెన్స్ అధికారులు తెలిపారు. దాడుల్లో విజిలెన్స్ ఎస్‌పి టి శోభామంజరి, విజిలెన్స్ సిఐలు ఆంటోని, కిషోర్, ఎఒ కె వెంకట్రావ్ పాల్గొన్నారు.

చిత్రం.. గుంటూరులోని ఓ మిల్లులో తాలుమిర్చి బస్తాలు పరిశీలిస్తున్న విజిలెన్స్ అధికారులు