ఆంధ్రప్రదేశ్‌

విశాఖలో 6న ‘జై ఆంధ్రప్రదేశ్’ సభ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, నవంబర్ 4: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చి తీరాలని పట్టుపడుతున్న ప్రతిపక్ష నాయకుడు జగన్ ఇదే అంశంపై రాష్ట్ర నలుమూలలా యువభేరి పేరుతో సభలు నిర్వహించారు. జగన్ డిమాండ్‌ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏమాత్రం పట్టించుకోలేదు. హోదాకు దీటుగా ప్యాకేజీ ఇచ్చి కేంద్రం చేతులు దులుపుకొంది. ఇచ్చినంత తీసుకోపోతే నష్టపోతామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చిందాంతో సరిపెట్టుకున్నారు. జగన్ డిమాండ్ డిమాండ్‌గానే మిగిలిపోయింది. అదే డిమాండ్‌తో ఉద్యమాన్ని మరో కొత్త పేరుతో జగన్ ప్రారంభించనున్నారు. రెండో దశ ఉద్యమానికి జై ఆంధ్రప్రదేశ్ అని నామకరణం చేశారు. విశాఖలో తొలి సభను నిర్వహించనున్నారు. స్థానిక మున్సిపల్ స్టేడియంలో ఆదివారం ఈ సభ జరగనుంది. విశాఖలోని ఆరు నియోజకవర్గాల నుంచి జనాన్ని సమీకరించాలనుకున్నారు. కానీ అధికార పార్టీ అందుకు అడ్డుకట్టవేసింది. దీంతో జిల్లాలోని 15 నియోజకవర్గాల నుంచి జనాన్ని తరలించాలని చూశారు. అది కూడా సాధ్యమయ్యే పరిస్థితి కనిపించకపోవడంతో, ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల నుంచి జనాన్ని తీసుకువచ్చేందుకు వైకాపా నాయకులు తంటాలు పడుతున్నారు. గ్రేటర్ విశాఖ నగరపాలక ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నందునఈ కార్యక్రమాన్ని తీసుకున్నారన్న వాదన కూడా వినిపిస్తోంది.