ఆంధ్రప్రదేశ్‌

24 గంటల్లో తీవ్ర వాయుగుండం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, నవంబర్ 4: పశ్చిమ బంగాళాఖాతంలో బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మరో 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారనుంది. ప్రస్తుతం ఈ వాయుగుండం విశాఖకు ఆగ్నేయంగా 210 కిలో మీటర్ల దూరంలో, అలాగే విశాఖకు దక్షిణ నైరుతి దిశగా 490 కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలియచేసింది. ఇది నెమ్మదిగా బంగ్లాదేశ్ వైపు కదులుతోంది. దీని ప్రభావం వలన ఉత్తర కోస్తాలో వర్షాలు కురుస్తాయని, ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలియచేసింది. దక్షిణ కోస్తాలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 45 నుంచి 55 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచడం వలన మత్స్యకారులు వేటకు వెళ్లద్దని హెచ్చరించింది. కళింగపట్నం, విశాఖపట్నం, భీమునిపట్నం, గంగవరం పోర్టుల్లో మూడవ ప్రమాద హెచ్చరికలను జారీ చేశారు. అలాగే కృష్ణపట్నం, వాడరేవు పోర్టుల్లో ఒకటవ నెంబరు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు.