ఆంధ్రప్రదేశ్‌

పఠాన్‌కోట్ జవానుకు రూ. 10 లక్షల పరిహారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 5: పఠాన్ కోట్ బాంబు పేలుడు బాధితుడు, శ్రీకాకుళం జిల్లా బిడ్డ శ్రీరాములుకు ముఖ్యమంత్రి చంద్రబాబు రూ.10 లక్షల సహాయం అందజేశారు. శనివారం ఉదయం ఉండవల్లిలోని నివాసంలో తనను కలిసిన శ్రీరాములుకు రూ.10 లక్షల చెక్‌ను స్వయంగా అందజేశారు. అతడి కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఇళ్ల స్థలం మంజూరు చేస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి తగిన స్థలాన్ని గుర్తించాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. శ్రీకాకుళం జిల్లా వంగర మండలం ఓని అగ్రహారం గ్రామానికి చెందిన కె.శ్రీరాములు నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ (ఎన్‌ఎస్‌జి)లో పనిచేస్తున్నాడు. పంజాబ్‌లోని పఠాన్‌కోట్ ఎయిర్ బేస్‌పై గత జనవరిలో తీవ్రవాదుల దాడి తర్వాత శ్రీరాములుకు అక్కడ విధి నిర్వహణ అప్పగించారు. మరణించిన పాక్ తీవ్రవాదుల దగ్గర ఉన్న బాంబులు నిర్వీర్యం చేసే యత్నంలో ఒక బాంబు ప్రమాదవశాత్తు పేలి తీవ్ర గాయాలయ్యాయి. ఢిల్లీలోని ఆర్ ఆర్ ఆస్పత్రిలో చికిత్స చేశారు. కోమాలోకి వెళ్లి కోలుకున్నాడు. శరీరంలో బాంబు శకలాలను శస్త్ర చికిత్స ద్వారా చాలా వరకు తీసివేశారు. మిగిలిన వాటిని తీస్తే ప్రాణాపాయమని వైద్య నిపుణులు హెచ్చరించారు. తీవ్రంగా గాయపడి కోలుకున్న శ్రీరాములు శరీరంలో మిగిలిన బాంబు శకలాలతో ఇప్పటికీ నరకయాతన అనుభవిస్తున్నాడు. గత నెల 25న శ్రీరాములు ముఖ్యమంత్రి చంద్రబాబును కలుసుకుని విజ్ఞప్తి చేశారు. అతడి పరిస్థితికి చలించిన ముఖ్యమంత్రి రూ.10 లక్షల సహాయం ప్రకటించారు. చెక్‌ను చంద్రబాబు శనివారం ఉదయం తన నివాసంలో శ్రీరాములుకు అందజేశారు.
chitram..
ఎన్‌ఎస్‌జి గార్డు శ్రీరాములుకు సాయం అందిస్తున్న సిఎం చంద్రబాబు