ఆంధ్రప్రదేశ్‌

‘దండయాత్ర’ కొనసాగింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 5: ఆలోచనలు స్వచ్ఛంగా ఉండాలి, కార్యాచరణ స్వచ్ఛంగా ఉండాలి, వాటిని స్వచ్ఛందంగా అమలు చేయాలి, అప్పుడే స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, స్వచ్ఛ భారత్ సాకారం అవుతుందని’ ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. పారిశుద్ధ్యం, అంటువ్యాధుల నియంత్రణపై ఉండవల్లిలోని తన నివాసం నుంచి వైద్య ఆరోగ్య శాఖ, మున్సిపల్, పంచాయతీ రాజ్, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ అధికారులతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ‘పరిసరాల పరిశుభ్రత - దోమలపై దండయాత్ర’ కార్యక్రమాన్ని మరో రెండు నెలలు పొడిగించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అంటువ్యాధుల పరిస్థితి గతవారం ఎంత ఉందో ఈ వారం కూడా అంతే ఉందంటూ ఇది కరెక్టు కాదన్నారు. ముందు జాగ్రత్తలు తీసుకోవడం, సకాలంలో సరైన వైద్య చికిత్స, ప్రజా చైతన్యం ద్వారానే అంటు వ్యాధులను నిర్మూలించగలమన్నారు. మస్కిటో బ్రీడింగ్ కంట్రోల్ యాక్టు రూపొందించడం పూర్తయిందని, రానున్న కాబినెట్ భేటీలో దీనిని పెట్టనున్నట్లు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. పారిశుధ్యం మెరుగుపర్చడంలో స్థానిక సంస్థల అధికారులు, సిబ్బంది మరింత బాధ్యతగా పనిచేయాలన్నారు. కొన్ని శాఖల పనితీరు బాగుందని, మరికొన్ని శాఖలు మందకొడిగా ఉన్నాయని సిఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. వనరులు కల్పించి, అన్ని విధాలా ప్రోత్సహించి, ఇన్ని అవకాశాలు కల్పించినా సామర్థ్యం మెరుగుపడకపోతే ప్రయోజనం ఏముందని ఆయన అధికారులను ప్రశ్నించారు. పారిశుద్ధ్యం మెరుగు, అంటువ్యాధుల నియంత్రణ వైద్య, ఆరోగ్య శాఖ, మున్సిపల్ శాఖ, పంచాయతీ రాజ్ శాఖలదే ప్రధాన బాధ్యతగా పేర్కొన్నారు. ప్లానింగ్, జీఏడి విభాగాలు ఎప్పటికప్పుడు ఆ శాఖలను పర్యవేక్షించాలని, సమన్వయం చేయాలని ఆదేశించారు. పారిశుద్ధ్యంలో, అంటువ్యాధుల నియంత్రణలో, జీవన ప్రమాణాల పెంపులో మనమే దేశంలో ముందుండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షించారు. 2 లక్షల వర్మికంపోస్టు కేంద్రాల ఏర్పాటు లక్ష్యం కాగా ఇప్పటివరకు 67 వేలు గ్రవుండ్ అయ్యాయని, 27 వేలు పని ప్రారంభించాయని అధికారులు తెలిపారు. 2017 మార్చికల్లా రాష్ట్రంలో 3వేల పంచాయతీలు ఓడిఎఫ్ కావాలన్నారు. డ్రైన్లలో మురుగు ఎప్పటికప్పుడు తొలగించాలని, బ్లీచింగ్ జల్లాలని, క్లోరినేషన్ చేయాలని, యాంటీ లార్వా ఆపరేషన్లు నిర్వహించాలని అధికారులకు సూచించారు. ఇంకా అక్కడక్కడా దోమల ఉత్పత్తి జరుగుతోందంటే పరిస్తితి మెరుగుపడలేదనేది ధృవపడుతోందన్నారు. ఈ టెలికాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి సతీష్ చంద్ర, వైద్య ఆరోగ్య శాఖ, పంచాయతీ రాజ్, మున్సిపల్ శాఖల అధికారులు పూనం మాలకొండయ్య, రామాంజనేయులు, కరికాల్ వలవన్, కన్నబాబు తదితరులు పాల్గొన్నారు.