ఆంధ్రప్రదేశ్‌

ఇక అన్నీ సిమెంట్ రోడ్లే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 5: రహదారుల నిర్మాణంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. 2029 నాటికి అన్ని కాలాలకు అనువైన రోడ్ల సౌకర్యం కల్పించేందుకు రంగం సిద్ధమైంది. రాజధాని ప్రాంతం నుంచి అన్ని ప్రాంతాలకు వెళ్లే రోడ్లతో అనుసంధానం చేయాలని సంకల్పించారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 22 వేల కిలోమీటర్ల సిసి రోడ్లు ఉన్నాయి. అయితే వీటిని 34 వేల కిలోమీటర్లకు పెంచి, 56 వేల కిలోమీటర్లు విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఏడాది 5 వేల కిలోమీటర్ల సిమెంటు రోడ్లు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అందులో 2,480 కిలోమీటర్లు పూర్తి చేశారు. మిగిలిన రోడ్లను కూడా త్వరితగతిగా పూర్తిచేయాలని తాజాగా అధికారులను సిఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. అమరావతిలో అంతర్గత రోడ్ల నిర్మాణానికి చైనా, బ్రిటన్ కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయి. అమరావతిలో అంతర్గత రోడ్లతోపాటు ఇబ్రహీంపట్నం నుంచి కృష్ణానదిపై రాజధానికి వెళ్లే వంతెన నిర్మాణం, విజయవాడ, విశాఖపట్నం మెట్రో ప్రాజెక్టులపై కూడా ఆసక్తి వ్యక్తం చేస్తున్నాయి. సైనోఫోర్టోన్ కంపెనీ, బ్రిటన్‌తోపాటు చైనాలో అక్కడి ప్రభుత్వానికి సంబంధించిన పలు కాంట్రాక్టు పనులను చేస్తోంది. విజయవాడ మెట్రో రైల్ నిర్మాణ పనులను కేంద్ర ప్రభుత్వ నిధులతోను, విశాఖపట్నం మెట్రో పనుల్ని పిపిపి పద్ధతిలోను చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ రెండు ప్రాజెక్టులతో పాటు, అంతర్గత రోడ్ల నిర్మాణంపైనా బ్రిటన్, చైనా కంపెనీలు ముందుకురావడంతో వాటి ప్రతిపాదనలు పరిశీలించాలని సిఎం చంద్రబాబు మెట్రో కార్పొరేషన్, సిసిడిఎంసిలకు సూచించారు. మరోవైపు ఈ ప్రాజెక్టుల గురించి చర్చించేందుకు అమరావతికి రావాలని రాష్ట్ర ప్రభుత్వం ఆయా కంపెనీల ప్రతినిధులను కోరింది. త్వరలోనే తమ కంపెనీల తరఫున నిపుణుల బృందాన్ని పంపిస్తామని ఆ కంపెనీలు ప్రభుత్వానికి తెలియజేశాయి. గ్రామాలలోని రహదారులను ప్రధాన పట్టణాలతో అనుసంధానం చేయనున్నారు. పంచాయతీరాజ్ రోడ్లను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది