ఆంధ్రప్రదేశ్‌

హెల్త్ వర్శిటీకి నేడే మోదీ శంకుస్థాపన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, నవంబర్ 6: అమరావతిలో ప్రతిష్ఠాత్మకమైన ఇండో-యూకె హెల్త్ యూనివర్శిటీకి ఢిల్లీ నుంచి ప్రధాని నరేంద్ర మోదీ రిమోట్ సెన్సింగ్ వ్యవస్థ ద్వారా సోమవారం శంకుస్థాపన చేయనున్నారు. ఇండో-యూకె ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ఆధ్వర్యంలో తలపెట్టిన ఈ మెడికల్ ప్రాజెక్టులో భాగంగా రూ.1000 కోట్లతో వైద్య ఆరోగ్య విశ్వవిద్యాలయాన్ని, వెయ్యి పడకల మెగా ఆసుపత్రిని కృష్ణాయపాలెంలో నెలకొల్పనున్నారు. వీటికి అనుబంధంగా మెడికల్ ఎక్విప్‌మెంట్ తయారీ యూనిట్, మెడికల్ డేటా అనలిటిక్స్ సెంటర్, వైద్య సంబంధిత విభాగాలు, పరిశోధన, శిక్షణా సంస్థలు ఏర్పాటు కానున్నాయి. మొత్తం అన్ని విభాగాలు కలిపి హెల్త్‌కేర్ సిటీగా వ్యవహరించే ఈ మెగా ప్రాజెక్టును 2018 నాటికి పూర్తిచేసి ప్రారంభించేందుకు ఐయుఐహెచ్ సన్నాహాలు చేస్తోంది. దేశంలో ఐయుఐహెచ్ నిర్మించ తలపెట్టిన మొత్తం 11 మెగా మెడికల్ ప్రాజెక్టులకు అమరావతి కేంద్రంగా చేసుకోవాల్సిందిగా ముఖ్యమంత్రి చేసిన సూచన మేరకు ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా ఇక్కడ హెల్త్‌కేర్ కేంద్రాన్ని నెలకొల్పనున్నారు. దేశంలో ఏర్పాటయ్యే ఆసుపత్రులు, విశ్వవిద్యాలయాలు, ఇతర విభాగాలకు అమరావతి కేంద్ర కార్యాలయం కానుంది. ఇక్కడినుంచే కార్యకలాపాలు కొనసాగడమే కాకుండా అవసరమైన వైద్య పరికరాల తయారీ కూడా అమరావతి కేంద్రంగా మారనుంది. ఈ ప్రాజెక్టు స్థాపనపై గత ఫిబ్రవరి విశాఖ ఐయుఐహెచ్ రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఒయు కుదుర్చుకుంది. అనంతరం యూకే బృందం మార్చి నెలలో అమరావతిని సందర్శించి ఆసుపత్రిని నెలకొల్పే పాంతాన్ని పరిశీలించి వెళ్లింది. ఇక్కడ ఏర్పాటయ్యే విశ్వవిద్యాలయం, ఇతర విభాగాలకు యూకేలో ఉన్న ప్రపంచస్థాయి వైద్యకేంద్రంతో అనసంధానం చేస్తారు. దేశంలో నెలకొల్పుతున్న 11 మెగా ఆసుపత్రులు, విశ్వవిద్యాలయాలకు యూకే ప్రభుత్వానికి చెందిన నేషనల్ హెల్త్ సర్వీసెస్ ఐయుఐహెచ్‌కు భాగస్వామిగా ఉంటుంది. యూకేలో ఉన్న ప్రఖ్యాత ఎలరా క్యాపిటల్ ఈ ప్రాజెక్టుకు నిధులు అందించనుంది. అమరావతి ప్రాజెక్టుకు లండన్‌లోని విఖ్యాత కింగ్స్ ఆసుపత్రి భాగస్వామిగా ఉంటుంది. ప్రధానమంత్రి గత ఏడాది బ్రిటన్ పర్యటన సందర్భంగా చేసుకున్న ఒప్పందాల్లో భాగంగా ఐయుఐహెచ్ హెల్త్‌కేర్ సెంటర్ల ఏర్పాటుకు ముందుకొచ్చింది. అమరావతి ఆసుపత్రి నిర్మాణానికి సంబంధించిన డిజైన్లు, నిర్మాణదారు ఎంపిక దాదాపు పూర్తయింది. కాగా బ్రిటన్ ప్రధానితో కలిసి భారత ప్రధాని మోదీ శంకుస్థాపన చేయాలని నిర్ణయించారు.