ఆంధ్రప్రదేశ్‌

ప్రతి నియోజకవర్గంలో మహిళా పోలీసు స్టేషన్ : నన్నపనేని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు అర్బన్, నవంబర్ 6: నిర్భయ చట్టాన్ని పకడ్బందీగా అమలుచేయాలని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ నన్నపునేని రాజకుమారి అన్నారు. ఆదివారం స్ధానిక వౌర్య సమావేశ మందిరంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆమె మాట్లాడుతూ నిర్భయ చట్టంలో ఎన్నో లొసుగులు ఉన్నాయని, రేప్ కేసుల్లో కేసులు నమోదుచేసినా పటిష్టంగా అమలుకు నోచుకోవటంలేదన్నారు. చట్టాలను పటిష్టంగా అమలు చేయకపోతే బాధితులకు అన్యాయం జరుగుతుందన్నారు. సమాజంలో రోజురోజుకూ మహిళలపై ఆగడాలు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్ధితుల్లో మహిళా పోలీసుస్టేషన్ల సంఖ్య పెరగాలని ప్రతి నియోజకవర్గ కేంద్రంతోపాటు మునిసిపల్, పట్టణాల్లో మహిళా పోలీసుస్టేషన్లను ఏర్పాటు చేయాలన్నారు. మహిళా కమిషన్ బాధితులకు పూర్తిగాఅండగా ఉంటుందన్నారు. యువతలో అహంకార ధోరణి పెరగడంతో వైవాహిత సంబంధాలు దెబ్బతింటున్నాయన్నారు. ఇటీవల చిన్నపిల్లలపైన కూడా లైంగికదాడులు జరుగుతున్నాయన్నారు. ప్రొఫెసర్ లక్ష్మిని త్వరలోనే అరెస్టుచేస్తామని ఆమె తెలిపారు.