ఆంధ్రప్రదేశ్‌

తిరుపతిలో సైన్స్ మ్యూజియం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 7: ప్రపంచంలోనే అత్యుత్తమ స్థాయిలో సైన్స్ మ్యూజియం ఏర్పాటు చేసేందుకు తిరుపతిలో 50 ఎకరాలు స్థలం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని, ఈ మ్యూజియానికి జనవరి 3న ప్రధాని చేతుల మీదుగా శంకుస్థాపన జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. పిబి సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఆవరణలో జరిగిన 2వ ఆంధ్రప్రదేశ్ సైన్స్ కాంగ్రెస్-2016 మూడురోజుల సదస్సులో భాగంగా సోమవారం తొలిరోజు ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి మాట్లాడారు. విద్యార్థినీ విద్యార్థులు ఆలోచనా దృక్పథం పెంపొందించుకోవాలని, ఏ పనినైనా ఇష్టంతో చేస్తే అందులో సంతృప్తి ఉంటుందని, ఒత్తిడి ఉండదని అన్నారు. ప్రతి యూనివర్సిటీని ఇంక్యుబేషన్ సెంటర్‌గా రూపుదిద్దుతామన్నారు. మన రాష్ట్రంలోని విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానం, విజ్ఞానంలోనూ ఎంతో ప్రతిభ చూపుతున్నారని ప్రశంసించారు. సివి రామన్, మేరీ క్యూరి జయంతి రోజు రెండో ఎపి సైన్స్ కాంగ్రెస్ నిర్వహించుకుంటున్నాన్నారు. ఇదేరోజు పుట్టిన ఆచార్య ఎన్‌జి రంగా జయంతిని పురస్కరించుకుని ఆయనను కూడా స్మరించుకోవాల్సి ఉందన్నారు. విశాఖపట్టణాన్ని నేవీ హబ్‌గా తీర్చిదిద్దుతామని, అదేవిధంగా రాష్ట్రాన్ని డిఫెన్స్ మాన్యుఫ్యాక్చర్ హబ్‌గా కూడా భవిష్యత్తులో తీర్చిదిద్దుతామని తెలిపారు. చిత్తూరులో లేపాక్షి, నిమ్మకూరు, విశాఖపట్టణంలో డిఆర్‌డివో ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖ ప్రాజెక్టు ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. త్వరలోనే రాష్ట్రంలో లక్ష కోట్ల మేర పెట్టుబడులకు అవకాశమున్న సంస్థల ఏర్పాటుకు అంగీకరించామన్నారు. ఇదే విధానంలో ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యాన్ని కలుపుకుంటే రాష్ట్రానికి రెండు లక్షల కోట్ల మేర పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని చంద్రబాబు వివరించారు. రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావుకూడా సభలో మాట్లాడారు. ఎపి సైన్స్ అకాడమీ అధ్యక్షులు బిఎల్ దీక్షితులు సభకు అధ్యక్షత వహించారు.

చిత్రం.. విజయవాడలో జరిగిన సైన్స్ కాంగ్రెస్ తొలిరోజు సదస్సులో ప్రసంగిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు