ఆంధ్రప్రదేశ్‌

రాజధానిలో నిర్మాణాలకు తుళ్లూరులోనే ప్లాన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, నవంబర్ 8: రాజధాని గ్రామాల్లో భవన నిర్మాణ దరఖాస్తులను ఇకపై తుళ్లూరు సీఆర్డీయే కార్యాలయంలో స్వీకరించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇందులో భాగంగా కమిషనర్ చెరుకూరి శ్రీధర్ నేతృత్వంలో సంబంధిత అధికారులను నియమించినట్లు సీఆర్డీయే డెవలప్‌మెంట్ కంట్రోల్ విభాగం డైరెక్టర్ జెవి రాముడు తెలిపారు. మంగళవారం అనంతవరం, నేలపాడు గ్రామాల్లో సమావేశాలు నిర్వహించి నిర్మాణాలకు అనుమతులు ఎలా పొందాలనే విషయమై అవగాహన కల్పించారు. నేలపాడు గ్రామస్థులు కొందరు తమ సందేహాలను వ్యక్తం చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఇళ్లు నిర్మించామని, కొత్త విధానం వల్ల ఇబ్బందులు తలెత్తుతాయని అనంతవరం గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేశారు. గ్రౌండ్‌ఫ్లోర్, మొదటి అంతస్తు ఉన్న భవనాలకు అదనపు కట్టడాలకు ఉచితంగా అనుమతులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ప్రణాళికాబద్ధంగా రాజధాని నిర్మాణం జరుగుతున్నందున అనుమతులు తప్పనిసరని సీఆర్డీయే అధికారులు తేల్చిచెప్పారు. ఇందుకు ప్రజలు సహకరించాలని కోరారు. భవన నిర్మాణ అనుమతులపై 9న ఉద్ధండరాయనిపాలెం, లింగాయపాలెం, 10న శాఖమూరు, ఐనవోలు, 14న నవులూరు, కృష్ణాయపాలెం, 15న కురగల్లు, నీరుకొండ, 16న ఉండవల్లి, పెనుమాక, 17న ఎర్రబాలెం, మంగళగిరి మునిసిపల్ ఏరియా, 19న బేతపూడి, నిడమర్రు, 21న మందడం, తాళ్లాయపాలెం, 22న కొండమరాజుపాలెం, మోదుగులంకపాలెం, 23న తుళ్లూరు, రాయపూడి, బోరుపాలెం, 24న నెక్కల్లు, 26న వెంకటపాలెం, 28న తాడేపల్లి మునిసిపల్ ఏరియా ప్రాంతాల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తారు.