ఆంధ్రప్రదేశ్‌

ప్యాకేజీ బూటకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, నవంబర్ 10: ‘రాజకీయాలపై ఆసక్తి లేదు. సమకాలీన రాజకీయ దోపిడీ వ్యవస్థపైనే నా పోరాటం. గెలుపోటములతో సంబంధం లేదు. ఓట్లు వేస్తారో, లేదో తెలీదు. మీరంతా తోడుగా ఉండండి. నేను మీకు అండగా ఉంటా. రానున్న తరాల వారి కోసమే నా పోరాటం’ అని జనసేన పార్టీ అధ్యక్షుడు, సినీనటుడు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ‘2019 ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేస్తుంది. నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తా’నని పవన్ కల్యాణ్ విస్పష్టంగా చెప్పారు. వచ్చే ఏడాది అనంతపురంలో జనసేన పార్టీ తొలి కార్యాలయాన్ని ప్రారంభించి రాజకీయ ప్రస్థానాన్ని మొదలు పెడతానన్నారు. అనంతపురంలోని కొత్తూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీ మైదానంలో గురువారం నిర్వహించిన సీమాంధ్రుల హక్కుల చైతన్య సభలో ఆయన ఉద్వేగపూరితంగా ప్రసంగించారు. సభ ప్రారంభానికి ముందు ఇటీవల అమరులైన భారత సైనికుల ఆత్మకు శాంతి కలగాలని రెండు నిమిషాలు వౌనం పాటించారు. రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ వల్ల ప్రత్యేకంగా ఒరిగిందేమీ లేదని, మనకు రావాల్సిందే ఇస్తున్నారని విమర్శించారు. కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, సుజనాచౌదరి లాంటి వారు ప్రత్యేక హోదా గురించి మాట్లాడకుండా ప్రత్యేక ప్యాకేజీపై మాట్లాడుతూ ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. చట్టబద్ధత లేకుండా చేసిన ప్యాకేజీ అంటే ప్రజలను మోసగించడమే అన్నారు. నిధులు లేని ప్రత్యేక ప్యాకేజీ పేరు చెప్పి కొందరు సన్మానాలు చేయించుకుని, హీరోలయ్యారని ధ్వజమెత్తారు. కేంద్రం ప్రకటించిన ప్యాకేజీని సిఎం చంద్రబాబు ఎలా ఆమోదిస్తారని, దీనిపై ఆయన ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు.
‘ప్రత్యేక హోదా ఇవ్వకుంటే.. ఇవ్వబోమని చెప్పండి. నాన్చొద్దు.. ఇదే జరిగితే మా ప్రజల మనసులు గట్టి పడతాయి. ఆ మనసులు ఎంతకైనా తెగిస్తాయ’ని హెచ్చరించారు. కాకినాడ సభ తర్వాత రెండు మూడు వారాల్లోనే తాను అనంతపురం రావలసి ఉందని, అనివార్య కారణాల వల్ల ఆలస్యమైందని చెప్పారు. అనంతపురం అంటే తనకు ఎంతో ఇష్టం, ప్రేమ అని, నాపై మీరు చూపిన అభిమానం, ఆప్యాయత కంటే ఇక్కడి ప్రజలు పడుతున్న బాధలు తనను ఆవేదనకు గురి చేశాయన్నారు. సమస్యలతో సతమతమవుతున్న, కడుపుమండిన అనంతపురం జిల్లానుంచే రాజకీయ చైతన్యం మొదలు కావాలని యువతకు పిలుపునిచ్చారు. కల్లూరు సుబ్బారావు, తరిమెల నాగిరెడ్డి లాంటి వారి జీవితాలే స్వచ్ఛ రాజకీయాలకు స్ఫూర్తి అన్నారు. నోటికి ఏదొస్తే అది మాట్లాడే పార్టీ కాదు జనసేన అని స్పష్టం చేశారు. ‘నేను రాజకీయాల్లోకి రానప్పుడు శత్రువులు ఎవరూ లేరు. ఇప్పుడు ఏమీ చేయకపోయినా శత్రువులు తయారయ్యారు. ప్రజా సమస్యలపై మీరు స్పందించనిపక్షంలో నేను శత్రువునే. చాలా బలమైన శత్రువునేన’ని తనను విమర్శించేవారిని దృష్టిలో ఉంచుకుని అన్నారు. దశాబ్దాలుగా మీ మాటలు వింటున్నాం. 1972 తరం నేతలు చేసిన తప్పులతో నేటికీ అవస్థలు పడుతున్నాం. ఇకనైనా సిఎం చంద్రబాబు, జగన్ తమ తప్పులను సరిచేసుకోవాలి. లేకుంటే భావితరాలు తీవ్రంగా నష్టపోతాయని హెచ్చరించారు. టిడిపి ప్రభుత్వంపై రాజకీయ అవినీతి ఆరోపణలు వస్తున్నాయని, వాటిని దిద్దుకోవాలని సూచించారు. అమరావతి రాజధాని కొందరికే పరిమితమైందన్న ఆరోపణలు ఉన్నాన్నారు. ఇదే జరిగితే రాయలసీమ, ఉత్తరాంధ్రలో వ్యతిరేకత వస్తుందని, దీంతో వేర్పాటు వాద ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు.
పోలవరానికి రూ. 16వేల కోట్లు బడ్జెట్ ఇస్తామన్నారని, అదీ వ్యవసాయ ప్రాజెక్టులకు మాత్రమే నిధులిస్తామన్నారని, అయితే పోలవరానికి రాష్ట్రం ఖర్చు చేసిన రూ. 5వేల కోట్లు, మరో 3 వేల కోట్లు కలిసి రూ. 8 వేల కోట్లేనన్నారు. దీనికి జాతీయ హోదా ఎలా ఇచ్చారో చెప్పాలని, ఇది ముమ్మాటికీ వంచనే అన్నారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని పవన్ డిమాండ్ చేశారు. రాయితీలతో పరిశ్రమలు ఏర్పాటు చేస్తామన్నారని, రాయసీమలో ముఖ్యంగా అనంతపురంలో నీళ్లే లేవు పరిశ్రమలు ఎలా తెస్తారో, ఇక్కడి యువతకు ఎలాంటి ఉద్యోగాలిస్తారో చెప్పాలన్నారు. కడపలో రిఫైనరీలు ఏర్పాటు చేస్తామన్న అంశం కాగితాలకే పరిమితమైందని ఆరోపించారు. రాయలసీమ సమస్యలను జాతీయ స్థాయికి తీసుకెళ్తానన్నారు. అలాగే అనంతపురం జిల్లా సమస్యలను ప్రధానికి వివరించేందుకు ఇక్కడి ప్రజలను రైలులో ఢిల్లీ తీసుకెళ్తానన్నారు. అందుకోసం మోదీ అపాయింట్‌మెంట్ కోరానన్నారు. స్వరాజ్ అభియాన్ నేత మోగీంద్రయాదవ్‌తో కలిసి రైతుల కోసం పోరాడుతామన్నారు. అనంతపురం లాంటి జిల్లాకు రెయిన్‌గన్లు తాత్కాలిక ఉపశమనమే అన్నారు.
chitram...

అనంతపురంలో గురువారం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతున్న జనసేన పార్టీ అధ్యక్షుడు, సినీనటుడు పవన్ కల్యాణ్