ఆంధ్రప్రదేశ్‌

ప్రధాని మోదీ చర్య స్వాగతించదగినదే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, నవంబర్ 12: ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న కరెన్సీ రూ.500, రూ.1000 నోట్ల రద్దును ప్రజలు స్వాగతించడం అభినందనీయమని రాష్ట్ర ప్రణాళిక బోర్డు వైస్ చైర్మన్ కుటుంబరావు అన్నారు. శనివారం ఇక్కడ ‘బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ రంగంలో మార్పులు’ అనే అంశంపై ఏర్పాటు చేసిన జాతీయ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడుతూ దేశంలో ఆర్థిక, సామాజిక సమస్యలు ఎదుర్కొనేందుకు నోట్ల రద్దు ప్రక్రియ దోహదపడుతుందన్నారు. బ్యాంకింగ్ రంగంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ప్రభుత్వ రంగ బ్యాంకులు ప్రజలకు సేవలందించడంలో తమదైన రీతిలో దేశాభివృద్ధికి కృషి చేయడం వల్ల సత్ఫలితాలు వస్తున్నాయన్నారు. తద్వారానే బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగంలో అభివృద్ధి సాధ్యపడిందన్నారు. రూ.500, వెయ్యి నోట్ల రద్దు ప్రక్రియ వల్ల ప్రజల సొమ్ముకు మరింత భద్రత పెరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, నవంబర్ 12: కేంద్రం పెద్ద నోట్లను రద్దు చేస్తుందన్న సమాచారం ముఖ్యమంత్రి చంద్రబాబుకు ముందే తెలిసిందని, అందుకే తన వ్యాపార, వ్యవహారాలన్నీ ముందే చక్కదిద్దుకున్నారని వైకాపా సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ఆరోపించారు. విశాఖలో శనివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తన కుటుంబ వ్యాపార సంస్థ హెరిటేజ్ ఫుడ్‌లో కొంత భాగాన్ని మల్టీనేషనల్ కంపెనీ ఫ్యూచర్ గ్రూపునకు కొద్ది రోజుల కిందటే విక్రయించారన్నారు. ఇక తమ కుటుంబీకులు, పార్టీ పెద్దల వద్దనున్న నల్లధనాన్ని స్థిర, చరాస్తులుగా మార్చుకున్నారని ఆరోపించారు. ఇప్పుడు టిడిపి నేతలంతా నోట్ల రద్దుపై ఉపన్యాసాలిస్తున్నారన్నారు. నల్లధనం వెలికితీత చర్యల్లో భాగంగా కేంద్రం తీసుకున్న నోట్ల రద్దును తమ పార్టీ స్వాగతిస్తోందని, ఇదే సందర్భంలో చోటుచేసుకుంటున్న అపశృతులను ముందుగానే గుర్తించి, సరైన చర్యలు తీసుకుని ఉంటే బాగుండేదన్నారు. భవిష్యత్‌లో నగదు లావాదేవీలన్నీ పారదర్శకంగా జరగాలన్న లక్ష్యంతో కేంద్రం తీసుకున్న నిర్ణయం లోపాలపుట్టగా అభిప్రాయపడ్డారు. దేశంలో ఆరు లక్షలకు పైగా గ్రామీణ ప్రాంతాలున్నాయని, ఉన్న బ్యాంకులు కేవలం 38 వేలు మాత్రమేనన్నారు. అంటే 20 గ్రామాలకు ఒక బ్యాంకు అందుబాటులో ఉందని, దీనివల్ల సామాన్యులు ఖాతాలు తెరచుకునే అవకాశం చాల స్వల్పమన్నారు. ఈ అంశాలను పరిగణలోకి తీసుకుని, పూర్తి మధింపు జరిపిన తరువాత నిర్ణయం తీసుకుని ఉంటే సామాన్యులకు ఇక్కట్లు తప్పేవన్నారు. కొత్తగా అమల్లోకి తెచ్చిన రూ.2000 నోటు వల్ల నల్లధనం పెరిగే అవకాశం ఉందన్నారు. కాగా ప్రజలను మద్యానికి బానిసచేసేందుకు టిడిపి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు దోహదపడుతున్నాయనని బొత్స ఆరోపించారు. పర్యాటక ప్రాంతాల్లో కొత్తగా బార్ లైసెన్సులు ఇవ్వాలన్న నిర్ణయానికి తాము పూర్తి వ్యతిరేకమన్నారు. దీనితో పాటు చీప్ లిక్కర్‌ను 90 మిల్లీలీటర్లు, 180 మిల్లీ లీటర్ల టెట్రా ప్యాకెట్లలో సరఫరా చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. సామాన్యుల కుటుంబాలు రోడ్డున పడే ప్రమాదం ఉందన్నారు. చీప్ లిక్కర్‌ను టెట్రా ప్యాకెట్లలో సరఫరా చేసే టెండర్‌ను వైకాపా తరపున గెలిచి, తెలుగుదేశం పంచన చేరిన ఎంపి ఎస్‌పివై రెడ్డికి కట్టబెట్టేందుకు నిర్ణయించారని ఆరోపించారు. పార్టీ ఫిరాయించిన ప్రజా ప్రతినిధులకు ఈవిధంగా తాయిలాలు ఎరవేసి తమ వైపునకు తిప్పుకోవడం సమంజసమాని ప్రశ్నించారు. ప్రత్యేక హోదాపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముగిసిన అధ్యాయంగా పేర్కొనడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.

విలేఖరులపై దాడుల
నివారణకు హైపవర్ కమిటీ
ఆంధ్రభూమి బ్యూరో
కాకినాడ, నవంబర్ 12: రాష్ట్రంలోని పాత్రికేయులపై దాడుల నివారణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైపవర్ కమిటీని నియమించిందని, ఈ కమిటీ విధి విధానాలను రూపొందించేందుకు త్వరలో విజయవాడలో రాష్టస్థ్రాయి సమావేశాన్ని ఏర్పాటుచేస్తామని ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప చెప్పారు. కాకినాడలో శనివారం విలేఖరులతో చినరాజప్ప మాట్లాడారు. మీడియా ప్రతినిధులపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు హైపవర్ కమిటీని ఏర్పాటుచేశామన్నారు. జిఒఎంఎస్ నెంబర్ 401 ద్వారా తన అధ్యక్షతన హైపవర్ ఈ కమిటీ ఏర్పాటయ్యిందని చెప్పారు. తాను ఛైర్మన్‌గా వ్యవహరించే హైపవర్ కమిటీ రాష్ట్రంలోని 13 జిల్లాల్లో కమిటీలను ఏర్పాటుచేస్తుందన్నారు. ఆయా కమిటీల ఆధ్వర్యంలో పాత్రికేయులపై దాడుల నివారణకు కృషి చేయనున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో మీడియా ప్రతినిధులపై దాడులను ప్రభుత్వం ఎట్టిపరిస్థితుల్లో సహించదని స్పష్టం చేశారు. విలేఖరులపై దాడులకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకోవల్సిందిగా ఆయా జిల్లాల ఎస్పీలను ఆదేశించినట్ట్టు చెప్పారు.

నోటు మార్చాలంటే కూలీకి ఎసరు
ఆంధ్రభూమి బ్యూరో
విజయనగరం, నవంబర్ 12: ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న సాహసోపేత నిర్ణయం సామాన్యునికి కష్టాలను మిగిల్చింది. నల్ల కుబేరుల నుంచి నల్లధనం రాబట్టడానికి తీసుకున్న నిర్ణయం సామాన్యుని అవస్థలకు గురిచేస్తొంది. పాత రూ.500, రూ.1000 నోటు మార్చాలంటే దినసరి కూలీలు ఆ రోజు వేతనం పోగొట్టుకోవాల్సిన దుస్థితి ఎదురైంది. నోటు మార్చుకోవాలో.. కూలి పనికి వెళ్లాలో తెలియక విజయనగరం జిల్లాలో కూలీలు అవస్థలు పడుతున్నారు. ఒక వేళ నోటు మార్చుకోవాలంటే బ్యాంకుల వద్ద కనీసం 3 నుంచి 4 గంటల సమయం వేచి ఉండాల్సి వస్తుంది. తీరా నోటు మార్చుకున్నాక పనికి వెళ్దామంటే ఆ సమయంలో పనికి రానివ్వని వైనం. దీంతో సామాన్యులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోపక్క మార్కెట్లో వంద నోట్లు సరిపడినన్ని అందుబాటులో లేకపోగా ఎటిఎంలు కూడా మూతపడ్డాయి. కొత్త రూ.2వేలు నోట్లు ఉన్నప్పటికీ వాటిని ఎటిఎంలలో డ్రా చేయడానికి వీలులేని పరిస్థితి. కొత్తగా విడుదల చేసిన నోట్ల సైజు, పాత నోట్ల కంటే తక్కువగా ఉండటంతో ఎటిఎంలలో ఆ నోట్లు స్వీకరించడం లేదు. దీంతో అన్ని ఎటిఎంలలో ఆ సాఫ్ట్‌వేర్ కొత్తగా ఫీడ్ చేయాలని చెబుతున్నారు.

బాలోత్సవ్ బ్రోచర్ ఆవిష్కరణ
భద్రాచలం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం కేంద్రంగా డిసెంబర్ 18, 19 తేదీల్లో రెండురోజుల పాటు జాతీయస్థాయి భద్రాద్రి బాలోత్సవ్-2016 నిర్వహిస్తున్నట్లు తాళ్లూరి పంచాక్షరయ్య, బూసిరెడ్డి శంకర్‌రెడ్డి, పాకాల దుర్గాప్రసాద్, బెక్కంటి శ్రీనివాస్ వెల్లడించారు. ఈ మేరకు భద్రాచలంలో శనివారం జాతీయస్థాయి భద్రాద్రి బాలోత్సవ్ బ్రోచర్లను ఆవిష్కరించారు.

విశాఖలో ఐఐసిటి శాఖ

ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, నవంబర్ 12: భారత ప్రభుత్వ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియర్ రీసెర్చ్ (సిఎస్‌ఐఆర్) అనంబంధంగా పనిచేసే ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసిటి) కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. విశాఖలో గీతం యూనివర్శితో కలిసి ఐఐసిటి పనిచేయనుంది. అంతర్జాతీయ స్థాయిలో శాస్తవ్రేత్తల పర్యవేక్షణతో ప్రపంచ వ్యాప్తంగా పలు పరిశ్రమలకు సాంకేతిక సహకారాన్ని అందిస్తున్న ఐఐసిటి మాలిక్యులర్ మోడలింగ్, ఫార్మశీ, కేమినో ఫార్మాటిక్, బయో ఇన్ఫర్మేటిక్స్, కెమికల్ బయోలజీ, మెడిసినల్ కెమిస్ట్రీ-్ఫర్మకాలజీ, మెకానికల్ ఇంజనీరింగ్ సైనె్సస్, పాలిమర్స్, లిపిడ్ సైన్స్ టెక్నాలజీ, సింథటిక్ ఆర్గానిక్ కెమిస్ట్రీలతో పాటు సస్య రక్షణకు ఉపయోగపడే రసాయనాలు, క్రిమిసంహారకాలను తయారు చేసే పరిజ్ఞానాన్ని కలిగి ఉంది. ఈ సంస్థ తాజాగా గీతం యూనివర్శిటీతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు బయో ఇన్ఫర్మేటిక్స్, ఆర్గానిక్ కెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ, ఫార్మశీ, మెడిసిన్ విభాగాల్లో సంయుక్త అధ్యయనాలను చేపట్టనుంది. ఈ సందర్భంగా ఐఐసిటి చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ కె భాను ప్రకాష్ మాట్లాడుతూ విశాఖ నగరం పారిశ్రామిక కేంద్రంగా శరవేగంతో అభివృద్ధి సాధిస్తోందని, ఔషధ పరిశ్రమలు తమ సహకారం కోసం ఎదురు చూస్తున్నాయన్నారు. ఈ రంగాల్లో అవసరాన్ని గుర్తించిన గీతం యూనివర్శిటీ తమతో కలిసి పనిచేసేందుకు అంగీకరించడంతో విద్యార్థులతో కలిసి పరిశోధనలు చేస్తామన్నారు.