ఆంధ్రప్రదేశ్‌

ఇ-పాస్ బుక్‌లతో నకిలీలకు చెక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 13: ఇక రైతులు కార్యాలయం చుట్టూ తిరగకుండా ఇంటినుంచే తమ భూముల వివరాలు తెలుసుకునే సౌకర్యం అందుబాటులోకి రానుంది. వ్యవసాయమంటేనే కాలంతో కూడుకున్న పని. ఖరీఫ్, రబీ సీజన్లతో పాటు వేసవి పంటలతోనూ రైతులు ఆరుగాలం శ్రమిస్తూనే ఉంటారు. తామే కాకుండా కుటుంబ సభ్యులు సైతం రాత్రనక పగలనక వ్యవసాయంలో తలమునకలవుతారు. ఇటువంటి సమయంలో భూ సంబంధమైన సమస్యలు, రుణాల మంజూరులో ఇక్కట్లు తలెత్తితే అన్నదాతల అవస్థలు వర్ణనాతీతం. అటు వ్యవసాయాన్ని కనిపెట్టి ఉండలేక, ఇటు ప్రభుత్వ కార్యాలయాలు బ్యాంకులు చుట్టూ తిరగలేక రైతులు తీవ్ర ఇబ్బందులు పాలవ్వాల్సిందే. దీనివల్ల తీవ్రమైన కాలయాపనతో పాటు ఆర్థిక ఇబ్బందులూ చోటు చేసుకుంటున్నాయి. కేవలం ఐటి, పారిశ్రామిక అవసరాలకే కాకుండా... వ్యవసాయంలోనూ ఇ- పాలన వల్ల ఎలాంటి మెరుగైన ఫలితాలు రాబట్టవచ్చో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చూపిస్తున్నారు. రెవెన్యూ వ్యవస్థలో కంప్యూటరీకరణ వల్ల రైతులకు మేలు కలుగడమే కాకుండా, పారదర్శకతతో పనులు సైతం త్వరత్వరగా జరిగిపోతూ, కాలం ఆదా అవుతోంది. రెండేళ్ల నుంచి ప్రభుత్వం... రెవెన్యూను సాంకేతిక బాట పట్టించింది. ఆన్‌లైన్ ద్వారా వివిధ రకాల సేవలను రైతులకు, ప్రజలకు అందిస్తోంది. ముఖ్యంగా అన్నదాతలకు మేలు చేయాలనే ఉద్దేశ్యంతో, మీ భూమి, ఇ పంట, ఇ పాసు పుస్తకాలు, లోన్ క్రియేషన్ మాడ్యూల్, మీ సేవ ద్వారా రెవెన్యూ సేవలను అందిస్తోంది. వీటివల్ల రైతులకు సమయపాలన లభించడమే కాకుండా, అవినీతి రహిత సేవలు లభ్యమవుతున్నాయి. బ్యాంకు రుణాల మంజూరులో బోగస్ రుణాలకు అడ్డుకట్ట పడింది. బ్యాంకులు సైతం ఎంతో లబ్ధి పొందుతున్నాయి. అందివచ్చిన సాంకేతికతతో ఒక రైతుకు ఒకే రుణమిస్తోంది. బోగస్ పాస్ పుస్తకాలకు అడ్డుకట్ట వేయడానికి ప్రభుత్వం ఇ పాస్‌బుక్‌లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటివరకు రెండు మాన్యువల్ పట్టాదార్ పాస్ పుస్తకం, టైటిల్ డీడ్‌లను ఒకే పుస్తకంగా ఇ పాస్‌బుక్ రూపంలో ప్రభుత్వం రైతులకు అందజేస్తోంది. 13 రకాల సెక్యూరిటీ ఫీచర్‌తో రూపొందించిన ఇ పాస్ పుస్తకాలను నకిలీలు తయారు చేయడం అంత సులభం కాదు. ఈ పాస్‌బుక్ అనేది రైతుల ఇష్టప్రకారమే మంజూరు చేస్తారు. రాష్టవ్య్రాప్తంగా నేటి వరకు 9 లక్షల మంది రైతులకు ఇ పాస్‌బుక్‌లు అందజేశారు. కేవలం వ్యవసాయ సంబంధమైన సమస్యలే కాకుండా ఆదాయ, నివాస సర్ట్ఫికెట్‌తోపాటు ఫ్యామిలీ మెంబర్ సర్ట్ఫికెట్ వంటి 60 రకాల రెవెన్యూ సేవలను మీ సేవ ద్వారా ప్రభుత్వం అందజేస్తోంది.