ఆంధ్రప్రదేశ్‌

ధర్మ పరిరక్షణే లక్ష్యంగా స్వామీజీలతో సమ్మేళనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తూరు, నవంబర్ 13: హిందూ ధర్మంతో పాటు హిందూ దేవాలయాల పరిరక్షణ, గోవధ నిషేధం వంటి అనేక హిందూ ధర్మాల పరిరక్షణపై విస్తృతంగా ప్రచారం అవసరమని ఉత్తరాంధ్ర సాధు పరిషత్ అధ్యక్షుడు, ఆనందాశ్రమ పీఠాధిపతి స్వామి శ్రీనివాసానంద సరస్వతి పేర్కొన్నారు. అఖిలాంధ్ర హిందూ సమ్మేళనంపై ప్రచారం నిమిత్తం శ్రీకాకుళం జిల్లాలోని కొత్తూరులో ఆదివారం అఖిలాంధ్ర హిందూ ధర్మ కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం కృష్ణాపురంలోని ఆనందాశ్రమం 12వ వార్షికోత్సవం సందర్భంగా ఈనెల 20వ తేదీ ఆదివారం అఖిలాంధ్ర హిందూ మహా సమ్మేళనం నిర్వహించనున్నట్టు వెల్లడించారు. కార్యక్రమానికి దేశ నలుమూలల నుంచి సుమారు 80 మంది స్వామిజీలు హాజరుకానున్నట్టు చెప్పారు. సమ్మేళానికి హిందూ బంధువులందరూ ఆహ్వానితులేనన్నారు. సమస్త వేదాలకుపుట్టినిలైన భారతదేశం ప్రపంచానికి ఆధ్యాత్మిక బోధనలను అందించిందన్నారు. భారతదేశంలో సర్వమతాలు ఉన్నప్పటికీ అధికంగా హిందూ మతం నుంచి ఇతర మతాలకు మతమార్పిడిలు సంభవిస్తున్న తరుణంలో ఇటువంటి సభలు ఎంతో అవసరమన్నారు. ఈ సభల్లో స్వామీజీలు వచ్చి హిందూ మతధర్మంపై ప్రచారం చేయడంతో పాటు ఆధ్యాత్మిక బోధనలు చేయనున్నట్టు చెప్పారు. ఆర్‌ఎస్‌ఎస్, విశ్వహిందూ పరిషత్, బ్రహ్మకుమారీలు, టిటిడి ధర్మ ప్రచార మండలి వంటి హిందూ ధర్మ పరిరక్షకులు కూడా పాల్గొననున్నట్టు తెలిపారు. ఆ రోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం వరకు పలు ఆధ్యాత్మిక ప్రసంగాలు, మధ్యాహ్నం అన్నసమారాధన వంటి కార్యక్రమాలు ఉంటాయని వివరించారు. ఈ మహా సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని కోరారు.

చిత్రం..హిందూ మహా సమ్మేళనం కరపత్రాలను ఆవిష్కరిస్తున్న స్వామీజీలు