ఆంధ్రప్రదేశ్‌

ఉద్రిక్తతల నడుమ అభిప్రాయ సేకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, నవంబర్ 14: తీవ్ర ఉద్రిక్తతల నడుమ జస్టిస్ మంజునాథ నేతృత్వంలోని బిసి కమిషన్ విశాఖలో సోమవారం అభిప్రాయ సేకరణ జరిపింది. ఇప్పటికే ఉన్న రిజర్వేషన్లు చాలక బిసిలకు అన్యాయం జరుగుతున్న తరుణంలో మరికొన్ని కులాలను బిసిలుగా గుర్తిస్తే ఆయా వర్గాలు మరింత వెనుకబాటు తనానికి గురవుతాయంటూ పలు కులాల నాయకులు మంజునాధ కమిషన్ ఎదుట వాదించారు. కొన్ని కులాలు తమకు ప్రస్తుతం అమలు చేస్తున్న వర్గీకరణలో తమకు న్యాయం జరగట్లేదని, బిసి ఎ గా గుర్తించాలని పలు కుల సంఘాలు మంజునాధ కమిషన్‌కు వినతులు అందజేశాయి. ప్రస్తుతం అగ్ర వర్ణాలుగా ఎటువంటి రిజర్వేషన్లకు నోచుకోని కాపు, తెలగ, బ్రాహ్మణ, క్షత్రియ, కాపు గౌడ, రెడ్డి తదితర కులస్తులు తమకు బిసిలుగా పరిగణించాలని కోరుతూ మంజనాధ కమిషన్‌కు వినతులు అందజేశారు. కమిషన్ చైర్మన్ జస్టిస్ మంజునాథ మాట్లాడుతూ బిసిల్లో చేర్చాలని కోరుతూ 64 కులాల నుంచి వినతులు వచ్చాయని, అలాగే ప్రస్తుతం బిసిలుగా ఉన్న 32 కులాలు తమ వర్గీకరణను బిసి ఎ గాగుర్తించాలని కోరుతూ వినతులు అందజేశారన్నారు. సామాజిక, విద్య వెనుకబాటు తనం ప్రామాణికంగా కులాలను బిసిలుగా గుర్తించే అవకాశం ఉందన్నారు. అలాగే బోయ, రజక, వడ్డెర కులస్తులు తమను ఎస్టీలుగా గుర్తించాలని కోరుతూ వినతులు అందజేశారన్నారు. బిసిల్లో కొత్తగా చేర్చాల్సిన కులాలు, వర్గీకరణలో ఉన్నత స్థానంలో చేర్చాల్సిన కులాలకు సంబంధించి ప్రస్తుతం జరుగుతున్న సాధికార సర్వేలో అంశాలను పరిశీలించి, సామాజిక, విద్య స్థితి గతులను అధ్యయనం చేసిన మీదటే సిఫార్సు చేయనున్నట్టు ఆయన వెల్లడించారు. పర్యటనలో ఆయన వెంట కమిషన్ సభ్య కార్యదర్శి ఎ కృష్ణమోహన్, కమిషన్ సభ్యులు ఆచార్య మల్లెల పూర్ణ చంద్రరావు, శ్రీమంతుల సత్యనారాయణ, వెంకటేశ్వర సుబ్రహ్మణ్యం, బిసి సంక్షేమ శాఖ అధికారులు పాల్గొన్నారు. విశాఖ జెడ్పీ కార్యాలయం వద్ద విస్తృత బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎడిసిపి నవీన్ గులాఠీ ఆధ్వర్యంలో వందల సంఖ్యలో పోలీసులు జెడ్పీ పరిసరాల్లో మొహరించారు. కుల సంఘాల ప్రతినిధులు ర్యాలీలుగా వచ్చి కమిషన్‌ను కలిసేందుకు ప్రయత్నించగా అడ్డుకున్నారు.